తండ్రిని కాపాడిన మూడేళ్ల చిన్నారి...చావుబతుకుల ఎలా రక్షించిందంటే

మూడేళ్లు అంటే.అప్పుడు పిల్లలు ఎలా ఉంటారు.

 Three Years Virginia Girl Facetimes To Save Dadslife-TeluguStop.com

అమ్మా.పప్పా.

తాత.అత్త అంటూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ.తన తోటి పిల్లలతో ఆటలాడుకుంటూ.తమదొక లోకంగా బతుకుతుంటారు.అలాంటిది మూడేళ్ల వయసున్న చిన్నారి తన తండ్రిని చావుబతుకుల నుండి రక్షించిందంటే నమ్ముతారా.నమ్మితీరాల్సిందే.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది.తండ్రికి ఎలాంటి ఆపద వచ్చింది…చిన్నారి ఏ విధంగా తండ్రిని రక్షించింది .తెలుసుకోవాలంటే చదవండి.

అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలోని వించెస్టర్‌కు చెందిన ట్రెవర్ మెక్‌‌కేబ్, డెవాన్ మెక్‌‌కేబ్ భార్యభర్తలు.వీరికి ఇద్దరు పిల్లలు.ఎప్పటిలానే జులై 4న డెవాన్ మెక్‌‌కేబ్ ఆఫీసుకు వెళ్లిపోయింది.

తల్లి ఆఫీస్ కి వెళ్లడంతో ఇంట్లోనే ఉన్న ట్రెవర్ మెక్‌‌కేబ్ తన మూడేళ్ల కూతురు మాలీతో ఆటలాడుతున్నాడు.హఠాత్తుగా ట్రెవర్ కి గుండెనొప్పి రావడంతో కింద పడిపోయాడు.

తన తండ్రి ఎంతకూ లేవకపోవడంతో మాలీ ఏడుస్తూ.తండ్రిని తడుతూ లేపడానికి ప్రయత్నించింది.

అయినా తండ్రిలో స్పందన లేకపోవడంతో తన తండ్రి జేబులోని సెల్‌ఫోను తీసుకుని “ఫేస్ టైమ్” ద్వారా తన తల్లికి వీడియో కాల్ చేసింది.తల్లి ఫోన్ తీయగానే బిగ్గరగా ఏడుస్తూ ఫోన్ కెమెరాని తండ్రివైపు ఉంచి ,.నాన్నకు ఒంట్లో బాలేదని చెప్పి.వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది.

దీంతో అప్రమత్తమైన డెవాన్ 911కి ఫోన్ చేసింది.వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యులు ట్రెవర్‌ హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించి, ఆసుపత్రికి తరలించారు.సమయానికి ఆసుపత్రికి తీసుకురావడంతో చికిత్స చేసి ప్రాణాలు కాపాడగలిగారు.ఈ విషయమై డెవాన్ మెక్‌‌కేబ్ మీడియాతో మాట్లాడుతూ.

తన చిన్నారి కారణంగా అద్భుతం జరిగి, భర్త ప్రాణాలు నిలిచాయని ఆనందం వ్యక్తం చేసింది.అంతేకాదు తన కూతురు ‘సూపర్ మ్యాన్’ అంటూ ప్రశంసించింది.

దీంతో వించెస్టర్ ప్రాంతంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ చిన్నారి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది.మాలి చేసిన పనిని మనం కూడా మెచ్చుకుని తీరాలి.

శెభాష్ మాలీ…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube