మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.తల్లిదండ్రులు అప్రమత్తంగా పిల్లల్ని కాపాడుకోవాలి.
వాళ్ళు ఏం తింటున్నారు.? ఎలా ఉంటున్నారని.ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి.పసిమనసులు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏది ఇచ్చినా.ఏది కనబడినా.తీసుకొని తినేస్తారు.
వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలో హెచ్ ఎం ఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే ఆ పూజా కార్యక్రమం లో ఓ చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది.
చాక్లెట్ అనుకుందో ఏమో ఆ చిన్నారి ఓ చిన్నపాటి గణేష్ విగ్రహం మింగేసింది.తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
వెంటనే తన మూడేళ్ల చిన్నారి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు ఎక్స్రే తీసి చూడగా పొట్టలో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో ఎండోస్కోపీ ద్వారా ఆ మూడేళ్ల చిన్నారి కి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటకు తీశారు వైద్యులు.
వైద్యులు కూడా ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.పిల్లల విషయంలో అజాగ్రత్త పనికి రాదని, వాళ్ల కేరింగ్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.