మా భర్తకు నాలుగో భార్య కావాలంటున్న ముగ్గురు భార్యలు!  

Three wives who want a fourth wife for their husband, Pakistan,three wives,looking for fourth wife,marriage,financial status - Telugu Financial Status, Looking For Fourth Wife, Marriage, Pakistan, Three Wives

ప్రస్తుతం ఉన్న కాలంలో పెళ్లి చేసుకొని భార్య, బిడ్డలను పోషించడం ఎంతో కష్టమైనప్పటికీ, కొందరు ఇద్దరు భార్య పిల్లలను పోషిస్తుంటారు.కానీ పాకిస్థాన్‌లో సైల్‌కోట్‌లో నివసిస్తున్న అద్నాన్‌కు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ ఇతను నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమై పోయాడు.

TeluguStop.com - Three Wives Who Want A Fourth Wife For Their Husband

అయితే ఈ మూడు పెళ్లిళ్లు ఒకరికి తెలీయకుండా మరొకరిని చేసుకున్న వివాహాలు కాదు.చట్టపరంగా వారి నిర్ణయం మేరకే తను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు భార్యలు తన భర్తకు నాలుగో పెళ్లి కూడా చేయాలని ట్రై చేస్తున్నారు.ఇప్పటికే అద్నాన్‌కు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు.వీరి నెలసరి పోషణకు లక్ష నుంచి 1.5 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా అద్నాన్‌కు తెలిపారు.అయితే తన పెళ్లి చేసుకున్న ప్రతిసారీ తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.దీంతో తను నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు తెలిపారు.

TeluguStop.com - మా భర్తకు నాలుగో భార్య కావాలంటున్న ముగ్గురు భార్యలు-General-Telugu-Telugu Tollywood Photo Image

అద్నాన్‌కు తన ముగ్గురు భార్యల పేర్లు సంబాల్, షబానా, శహీదా కావడంతో నాలుగో భార్య పేరు కూడా ఎస్ అనే అక్షరం తో నే మొదలయ్యే అమ్మాయి అయితే బాగుంటుందని ఏకంగా తన ముగ్గురు భార్యలు అమ్మాయిని వెతకడం కోసం ట్రై చేస్తున్నారు.అయితే ఇంట్లో ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ ఎవరు కూడా గొడవ పడకుండా తనకు కంప్లైంట్ చేయకుండా ఒకరికొకరు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు.

ఈ ముగ్గురు భార్యలు అద్నాన్‌తో వంతుల వారీగా సమయాన్ని కేటాయిస్తూ గడుపుతుంటారు.అద్నాన్‌ ఒక భార్య దగ్గర ఉన్నప్పుడు మిగతా ఇద్దరు పనులన్నీ చూసుకుంటారు.ఇలా వీరి మధ్య ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఎటువంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతారట అయితే ప్రస్తుతం తమ భర్తకు నాలుగో పెళ్లి చేయడానికి ఈ ముగ్గురు భార్యలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

#Pakistan #Marriage #Three Wives #LookingFor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Three Wives Who Want A Fourth Wife For Their Husband Related Telugu News,Photos/Pics,Images..