డ్రైవింగ్ రాని దొంగలు కారు దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు..!

ఇటీవలే కాలంలో కొందరు వ్యక్తులు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అడ్డదారులలో వెళ్లి అనవసరంగా దొరికిపోతున్నారు.ఇలాంటి కోవలోనే కొందరు దొంగలు కారు దొంగతనం( Car Theft ) చేసి తర్వాత తమకు డ్రైవింగ్ ( Driving ) రాదనే విషయం తెలిసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

 Three Thieves Stolen Car In Uttar Pradesh Kanpur Realized That They Even Dont Kn-TeluguStop.com

మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కారు లో ప్రయాణించాలంటే డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు.కారు దొంగతనం చేయాలంటే కచ్చితంగా డ్రైవింగ్ వచ్చి తీరాల్సిందే.

ఆ విషయం మర్చిపోయిన దొంగలు 10 కిలోమీటర్లు కారును తోసుకుంటూ వెళ్లి అడ్డంగా దొరికిపోయారు.వీరి కథ ఏమిటో చూద్దాం.

ఉత్తర్ ప్రదేశ్ లోని( Uttar Pradesh ) కాన్పూర్ లో ఉండే దబౌలి ప్రాంతంలో సత్యం కుమార్, అమన్ లు ఇంజనీరింగ్ చదువుతున్నారు.వీరిద్దరూ ఉండే అపార్ట్మెంట్లో అమిత్ అనే వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడింది.

తర్వాత ముగ్గురు కలిసి కష్టపడకుండా డబ్బు సంపాదించాలని, అందుకు బైక్, కార్లను దొంగతనం చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు.దొంగలించిన వాహనాలను నేరుగా మార్కెట్లో అమ్మితే దొరికిపోతామని భావించారు.

సత్యం ఒక వెబ్సైట్ తయారు చేశాడు.ఆ వెబ్సైట్ ద్వారా దొంగిలించిన వాహనాలను అమ్మాలని నిర్ణయించుకున్నారు.

Telugu Aman, Amith, Kanpur Realized, Satyam Kumar, Stolen Car, Uttar Pradesh, Ve

ఇక తాజాగా సోమవారం 22న ముగ్గురు కలిసి దొంగతనం చేసేందుకు బయటకు వెళితే.ఓ కారు ( Car ) కనిపించింది.కారు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ కారును దొంగతనం చేయాలని అనుకున్నారు.అయితే కారు దగ్గరికి వెళ్లాక ముగ్గురులో ఎవరికి కూడా డ్రైవింగ్ రాదు అనే విషయం బయటపడింది.

ఎలాగైనా కారు దొంగిలించి సొమ్ము చేసుకోవాలని కారును తోసుకుంటూ 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు.

Telugu Aman, Amith, Kanpur Realized, Satyam Kumar, Stolen Car, Uttar Pradesh, Ve

తరువాత కార్ నెంబర్ ప్లేట్లు మార్చేసి ఓ పక్కన పార్క్ చేసి వెళ్లిపోయారు.ఇంటికి వెళ్లి కారు ఫోటోలను వెబ్సైట్లో పెట్టి అమ్మాలనుకున్నారు.ఇంతలో బర్రా పోలీస్ స్టేషన్లో కార్ మిస్సింగ్ పై కేసు నమోదు అయ్యింది.

కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా నిర్మానుష్య ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న కారును యజమానికి చూపించగా తనదే అని పోలీసులకు తెలిపాడు.పోలీసులు సీసీటీవీ పుటేజ్ల ఆధారంగా దొంగతనం చేసిన ముగ్గురిని గుర్తించి వారి దగ్గర ఉన్న రెండు బైకులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube