ఎమ్మెల్యే ల నివాస భవన లిఫ్ట్ లో ప్రమాదం,ముగ్గురు టెక్నీషియన్స్ మృతి  

Three Technicians Dead In Lift Accident In A.p. Amaravati-lift Accident In A.p.,viral In Social Media

ఏపీ రాజధాని అమరావతి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో ఉన్న లిఫ్ట్ ప్రమాదానికి గురి అవ్వడం తో ముగ్గురు టెక్నీషియన్స్ దుర్మరణం పొందినట్లు తెలుస్తుంది. తుళ్లూరు మండలం రాయపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాల దగ్గర లిఫ్టులో ని ఐదో అంతస్తు లో పని చేస్తుండగా, ఉన్నట్టుండి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది..

ఎమ్మెల్యే ల నివాస భవన లిఫ్ట్ లో ప్రమాదం,ముగ్గురు టెక్నీషియన్స్ మృతి -Three Technicians Dead In Lift Accident In A.P. Amaravati

దీనితో లిఫ్ట్ లో పని చేస్తున్న టెక్నీషియన్స్ కు తీవ్ర గాయాలు కావడం తో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ ముగ్గురూ మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతులు అంతా కూడా బీహార్ కు చెందినవారుగా అధికారులు తెలిపారు.

రాహుల్ కుమార్, సురేంద్ర, కృపాల్ లు మృతులుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు కారణం ఏంటి అన్న దానిపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ లో జగన్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి చిన్న చిన్న మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే లిఫ్ట్ లో సమస్య తలెత్తడం తో టెక్నీషియన్స్ అక్కడకు చేరుకొని లిఫ్ట్ ని రిపేర్ చేస్తున్న సమయంలో ఇలా ప్రమాదానికి గురవ్వడం తో ఆ ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.