బాబుకి హ్యాండ్ ఇస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు! ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారా  

ఢిల్లీ వెళ్ళిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు. .

Three Tdp Mla Candidates Ready To Join Bjp-chandrababu,join Bjp,three Tdp Mla Candidates,ysrcp

టీడీపీ పార్టీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి టీడీపీ నేతలు క్యూ కట్టడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరిపోగా వారి దారిలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారని టాక్ వినిపిస్తుంది..

బాబుకి హ్యాండ్ ఇస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు! ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసారా-Three TDP MLA Candidates Ready To Join BJP

తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీని వీడటానికి రెడీ అయిపోయినట్లు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. అందులో ప్రధానంగా రేపల్లె ఎమ్మెల్యేగా తక్కువ మెజారిటీతో గెలిచిన అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈయనతో పాటు మీడియాలో టీడీపీ గొంతు బలంగా వినిపించిన అధికార ప్రతినిధి లంకా దినకర్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తుంది.

వీరందరూ ఢిల్లీలో అమిత్ షా ఆద్వర్యంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. వీళ్ళని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు ఢిల్లీకి తీసుకేల్లినట్లు తెలుస్తుంది. ఇక వీరి బాటలో ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.