రోవాన్ వర్సిటీలో ముగ్గురు విద్యార్ధుల ఆత్మహత్య: కౌన్సిలర్లు లేకపోవడంపై నిరసనలు

దక్షిణ న్యూజెర్సీలోని రోవాన్ విశ్వవిద్యాలయంలో ఇటీవలి కాలంలో వరుసగా విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో కలకలం రేపుతోంది.ప్రస్తుత సెమిస్టర్‌లో మూడవ ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవడంతో థాంక్స్ గివింగ్ తర్వాత రోజు .

 Three Students Rowan University-TeluguStop.com

గ్లాస్‌బోరోలో 19,600 మంది విద్యార్ధులు నిరసనకు దిగారు.రోవాన్ యూనివర్సిటీ అధ్యక్షుడు అలీ హౌష్ మండ్ మీడియాతో మాట్లాడుతూ.

ఒకే సెమిస్టర్‌లో ముగ్గురు విద్యార్ధులను కోల్పోవడం తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.

మరోవైపు విద్యార్ధుల మరణాలు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకిత్తించాయి.

కాలేజీ యాజమాన్యం మానసిక సమస్యలతో బాధపడుతున్న పూర్వ విద్యార్దులకు సాయం చేసేందుకు శ్రద్ధ చూపించడం లేదని పూర్వ విద్యార్ధులు సైతం మండిపడుతున్నారు.అయితే వర్సిటీ అధ్యక్షుడు మాత్రం ఈ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు.

గ్లాస్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ విద్యార్ధుల మరణాలపై స్పందించేందుకు నిరాకరించింది.అత్యంత సున్నితమైన ఈ అంశంలో దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Telugu Telugu Nri Ups, Rowan-

హాల్ మరియు సీనియర్ మోనికా ఫోలే మరణించిన విద్యార్ధుల సంస్మరణ సభను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 100 మంది విద్యార్ధులు హాజరయ్యారు.నిర్వాహకులు మౌన ప్రదర్శన కోసం కొవ్వొత్తులను అందజేయగా.కొందరు విద్యార్థులు తమకు తాముగా కొవ్వొత్తులను తీసుకొచ్చారు.విద్యార్థులు, ప్రజలు ఒకొరినొకరు ఆలింగనాలు చేసుకుని తమ సంతాపాన్ని తెలియజేశారు.యూనివర్సిటీలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా తగిన వనరులు లేవని ప్రస్తుత, మాజీ విద్యార్ధులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Telugu Nri Ups, Rowan-

క్యాంపస్‌లో విద్యార్ధులకు తగినంతమంది కౌన్సెలర్లు అందుబాటులో లేరని.ఈ విషయం పట్ల రోవాన్ వర్సిటీ పట్టించుకోవడం లేదని 2018లో డిగ్రీని పూర్తి చేసిన లారెన్ కుబియాక్ ట్వీట్ చేశారు.ఇదే సమయంలో హౌస్‌మండ్ విశ్వవిద్యాలయం గ్లాస్‌బోరో క్యాంపస్‌లో కౌన్సెలర్ల సంఖ్యను గత ఆరేళ్లలో మూడు రెట్లు పెంచగా.మరో ముగ్గురు నిపుణులను నియమించుకోవాలని చూస్తోంది.ఇక్కడ ఉన్న 15 మంది కౌన్సెలర్లు జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్నారని, ప్రతి 1,000 నుంచి 1,500 మంది విద్యార్ధులకు ఒక కౌన్సెలర్ సేవలు అందిస్తారని రోవాన్ వర్సిటీ సీనియర్ ఫోలే ఆన్‌లైన్‌లో తెలిపారు.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల ప్రకారం 2000వ సంవత్సరం నుంచి 15-24 ఏళ్ల మధ్య వయసున్న అమెరికన్ యువతలో ఆత్మహత్య రేటు పెరిగిందని తెలిపింది.

యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సైతం గత సెప్టెంబర్‌లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube