టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో మిడిల్ రేంజ్ స్టార్ హీరోగా ఎదిగిన నటులలో నాని ఒకరు.అష్టాచమ్మా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నాని కెరీర్ ను మొదలు పెట్టారు.
తొలి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఆ తరువాత అలా మొదలైంది సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన ఈగ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
అయితే ఈగ సినిమా తరువాత కొంతకాలం సక్సెస్ కు దూరమైన నానికి మారుతి దర్శకత్వం వహించిన భలే భలే మగాడివోయ్ సినిమా రూపంలో ఊహించని సక్సెస్ దక్కింది.
ఈ సినిమా తరువాత నాని కెరీర్ లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అయితే మారుతి ఈ సినిమా కోసం మొదట నానిని సంప్రదించలేదు.ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన తరువాత ఈ కథ నాని దగ్గరకు చేరింది.
ఈ సినిమా కథను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోలు ఎందుకు మిస్ చేసుకున్నామా అని నేటీకీ బాధ పడుతున్నారు.
నాగచైతన్య, అల్లరి నరేష్, సునీల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని సమాచారం.అయితే నాని అభిమానులు మాత్రం నాని మినహా మరెవరు నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదని కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.
ఈ సినిమాలో నటించడం ద్వారా నాని మార్కెట్ కూడా భారీగా పెరిగిందనే చెప్పాలి.నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తున్నారు.