వృద్ధ దంపతుల హత్య .. కెనడాలో ముగ్గురు భారత సంతతి యువకుల అరెస్ట్

వృద్ధ దంపతుల హత్యకు సంబంధించి కెనడాలో ముగ్గురు పంజాబీ యువకులపై పోలీస్ శాఖ అభియోగాలు మోపింది.మే నెలలో ఈ దంపతులు హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది.

 Three Punjabi Youth Charged In Relation To Killing Of Elderly Couple In Canada D-TeluguStop.com

అబాట్స్‌ఫోర్డ్‌కు చెందిన ఆర్నాల్డ్ (77) , జోవాన్ డి జోంగ్‌ (76) హత్యలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై అభియోగాలు మోపినట్లు ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (హెచ్ఐటీ) ఓ ప్రకటనలో తెలిపింది.ఈ ఏడాది మే 9న ఉదయం 10.26 గంటల సమయంలో 33600 బ్లాక్ ఆఫ్ ఆర్కాడియన్ వే లోని ఇంట్లో ఇద్దరు పెద్దలు మరణించినట్లుగా అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు.

అనంతరం హెచ్ఐటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు.

డిసెంబర్ 16న ఐహెచ్ఐటీ పరిశోధకులు , అబాట్స్‌ఫోర్డ్ పోలీసులు కలిసి ముగ్గురు పంజాబీ యువకులను అరెస్ట్ చేశారు.

వీరిని గురుకరణ్ సింగ్ (20), అభిజీత్ సింగ్ (22), ఖుష్వీర్ టూర్ (22)లుగా గుర్తించారు.వీరిపై ఫస్ట్ డిగ్రీ హత్యకు సంబంధించిన రెండు అభియోగాలను మోపారు.

ముగ్గురు అనుమానితులు సర్రేకు చెందినవారేనని పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ సెర్ మాట్లాడుతూ.

ఆర్నాల్డ్ దంపతులకు న్యాయం చేసే ప్రయాణంలో ఒక అడుగు దూరంలో వున్నట్లు తెలిపారు.

Telugu Abbotsd, Abhijit Singh, Arnold De Jong, Canada, Canada Punjabi, Gurkaran

ఐహెచ్ఐటీ, అబాట్స్‌ఫోర్డ్ మేజర్ క్రైమ్, పెట్రోల్, ఫోరెన్సిక్ ఐడెంటిఫికేషన్ బృందాలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.ఇదిలావుండగా.కెనడాలో భారత సంతతి వ్యక్తులు వరుసగా హత్యలకు గురవుతుండటం కలకలం రేపుతోంది.

డిసెంబర్ 3న మిస్సిసాగాలోని గ్యాస్ స్టేషన్ వెలుపల 21 ఏళ్ల పవన్ ప్రీత్ కౌర్ అనే పంజాబీ సంతతికి చెందిన యువతిని దుండగులు కాల్చిచంపారు.తర్వాత కొద్దిరోజులకే బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో 40 ఏళ్ల హర్‌ప్రీత్ కౌర్ అనే సిక్కు మహిళను దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.

ఇది సద్దుమణగకముందే అల్బెర్టా ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల సంరాజ్ సింగ్‌‌‌ను సైతం కత్తితో పొడిచి చంపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube