పామును చంపి కూర వండిన ముగ్గురు యువకులు.. చివరకు?

Three People Killed Snake In Tamilnadu

సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే ఎవరైనా పామును చంపడానికి ప్రయత్నించడం లేదా దూరంగా విసిరివేయడం చేస్తారు.అయితే తమిళనాడులో మాత్రం కొందరు యువకులు పామును చంపి వండుకుని తిన్నారు.

 Three People Killed Snake In Tamilnadu-TeluguStop.com

సాధారణంగా మన దేశంలో కొన్ని జంతువులను మాత్రమే మనుషులు తినడానికి అనుమతి ఉంది.నిషేధం ఉన్న జంతువులను తింటే శిక్ష విధిస్తారు.

ముగ్గురు యువకులు పామును చంపిన విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు.

 Three People Killed Snake In Tamilnadu-పామును చంపి కూర వండిన ముగ్గురు యువకులు.. చివరకు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని సేలం జిల్లా మేట్టూరు తంగమామునిపట్టణంలో 40 సంవత్సరాల వయస్సు గల శివకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు.

శివకుమార్ అతని స్నేహితులైన మహ్మద్ హుస్సేన్, సురేష్ లతో ఉన్న సమయంలో ఒక పాము అక్కడికి వచ్చింది.పామును చూసిన వెంటనే వాళ్లు ముగ్గురు కర్రల సహాయంతో చంపేశారు.

ఆ తరువాత వారిలో ఒకరికి పామును చంపి వండుకుని తినాలనే ఆలోచన వచ్చింది.

అనుకున్నదే తడవుగా వాళ్లు తమ స్నేహితుడైన జయప్రకాష్‌ కు అసలు విషయం చెప్పి కాళియమ్మన్‌ ఆలయం వెనుక భాగంలో పామును ముక్కలు ముక్కలు చేసి వండుకుని తిన్నారు.

అయితే వాళ్లు అక్కడితో ఆగి ఉంటే ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు.పామును చంపిన తరువాత వాళ్లు సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి ఇతరులకు పంపారు.

అయితే వాళ్ల స్నేహితులు వీడియోను వైరల్ చేయడంతో విషయం అటవీశాఖ అధికారులకు తెలిసింది.

మేట్టూరు అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

చట్టం ప్రకారం పామును చంపి తినడం నేరమని అందువల్లే వాళ్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు.పామును చంపి ముక్కలుగా చేసి తినడంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Snake #Siva Kumar #Md Hussain #Tamilandu #Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube