కరోనా వార్డులో ముగ్గరు మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం

భారతదేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే 900కు దగ్గరగా చేరింది.దీంతో భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది.

 Three Patients Dead In Corona Virus Isolation Ward In Tamil Nadu-TeluguStop.com

ఇప్పటికే 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే కరోనా సోకిన వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తు్న్నారు.

తాజాగా తమిళనాడులో కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులో ముగ్గురు రోగులు మృతి చెందినట్లు తెలుస్తోంది.దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అయితే మృతిచెందిన వారికి గతంలోనే పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి కారణంగానే మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది.మృతుల్లో ఒకరైన వృద్ధుడు(66) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా, మరో యువకుడు(24) వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు.

కాగా ఓ చిన్నారి(2) ఒస్టెయోపెట్రోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతోందట.ఈ వ్యాధుల కారణంగా వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఇంకా వాటి రిపోర్టులు రాలేదని వారు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube