వైసీపీలో ముగ్గురు కొత్త ఫైర్‌బ్రాండ్లు... మారిన స‌మీక‌ర‌ణ‌లు !

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి.ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై పైచేయి సాధించేందుకు విప‌క్షం ఎన్నో ప్లాన్ల‌తో బ‌రిలోకి దిగినా తొలి రోజే తుస్సుమ‌నిపించింది.

 Three New Fire Brands In Ysrcp... Changes Political War,ap,assembly Sessions,kod-TeluguStop.com

ప్లాన్ రివ‌ర్స్ కావ‌వంతో తొలి రోజే చంద్ర‌బాబుతో స‌హా ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు.ఈ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని అనేక విధాలా ఇరుకున పెట్టాల‌ని 20 అంశాల‌ను కూడా టీడీపీ రెడీ చేసుకుంది.

వీటిపై ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.అయితే ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌క్షం కూడా గ‌ట్టిగా తిప్పికొట్టాల‌ని టీడీపీకి వాయిస్ కూడా లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

దీనిపై గ‌డిచిన వారం రోజులుగా క‌స‌ర‌త్తు చేసిన సీఎం జ‌గ‌న్‌, ఇత‌ర మంత్రులు కూడా మంత్రివ‌ర్గంలోని వారికి కొంద‌రికి గ‌ట్టి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని తెలుస్తోంది

ముఖ్యంగా అసెంబ్లీలో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై ఇప్ప‌టికే ఎమ్మెల్యేల‌కు విష‌యాన్నినొక్కి చెప్పిన జ‌గ‌న్ అంద‌రూ స‌బ్జెక్టు తెలుసుకుని రావాల‌ని వివ‌రించారు.ఇక‌, చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌లు ఎంచుకున్న విష‌యాలు ముందుగానే త‌మ‌కు తెలుసు క‌నుక ఎవ‌రెవ‌రు ఏయే అంశాల‌పై గ‌ళం విప్పాలో ఓ నోట్ సిద్ధం చేసుకున్నారు.

దీని ప్ర‌కారం ఈ స‌మావేశాల్లో గ‌తానికి మించి ఫైర్ బ్రాండ్ల‌ను ఎక్కువ మందిని వినియోగించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.ఇప్ప‌టి వ‌రకు మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ వంటివారు అసెంబ్లీ స‌మావేశాల్లో కీల‌కంగా క‌నిపించేవారు.

ప్ర‌తిప‌క్షంపై సెటైరులు వేసేవారు.ముఖ్యంగా చంద్ర‌బాబును సైతం కామెంట్ల‌తో కుమ్మేశేవారు.

Telugu Andhra Pradesh, Assembly, Buggana, Chandra Babu, Brands, Kodali Nani-Poli

అయితే ఇక‌పై జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లో వైసీపీలో స‌రికొత్త ఫైర్‌బ్రాండ్లు రంగంలోకి దిగ‌నున్నారు.ఇప్పుడున్న వీరికి తోడుగా మ‌రో ముగ్గురిని ఫైర్ బ్రాండ్లుగా రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు.వీరిలో కొత్త మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ఉన్న‌ట్టు తెలుస్తోంది.అదేవిధంగా మ‌హిళ‌ల్లో మేక‌తోటి సుచ‌రిత‌‌ను వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.ముఖ్యంగా మ‌హిళ‌లు, ఎస్సీల‌పై దాడుల‌కు సంబంధించి ప్ర‌తిప‌క్షం లేవ‌నెత్తే స‌మ‌స్య‌ల‌పై ఈమె గ‌ట్టిగా స‌మాధానం చెప్పాల‌ని.ఇప్ప‌టికే సీఎంవో నుంచి కూడా స‌మాచారం అందిన‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ఈ సారి ఎక్కువ అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.ఆయ‌న‌కు మంత్రిగా అవ‌కాశం లేక‌పోయినా గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌నను వినియోగించుకునేందుకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం.

మొత్తంగా వైసీపీ స‌మీక‌ర‌ణ‌లు మారిన నేప‌థ్యంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube