దారుణం : ముగ్గురిని చంపి శివుడికి రక్తాభిషేకం చేశారు, ఎక్కడ ఎందుకు తెలిస్తే నోరెళ్లబెడతారు  

Three Murders In Anantapur District-

కంప్యూటర్‌ యుగంలో కూడా ఇంకా మూడ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.అత్యంత దారుణంగా నరబలులు ఇస్తున్నారు.క్షుద్ర పూజలు చేసి ఒకప్పుడు జంతువులను బలి ఇచ్చే వారు...

Three Murders In Anantapur District--Three Murders In Anantapur District-

కాని ఇప్పుడు ఏకంగా మనుషులను బలి ఇవ్వడం భయంకరంగా సాగుతోంది.తాజాగా ముగ్గురు వ్యక్తులను చంపి వారి రక్తంతో శివలింగానికి రక్తాభిషేకం చేయడంతో పాటు, పాము పుట్టలో రక్తంను అభిషేకం చేయడం జరిగింది.ఈ సంఘటన మరెక్కడో జరగలేదు.

తెలుగు రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోనే జరిగింది.

Three Murders In Anantapur District--Three Murders In Anantapur District-

అనంతపురం జిల్లా తనకల్ల మండలం కొర్తికోటకు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శివ రామిరెడ్డికి తన గ్రామంలో ఉన్న శివాలయం అంటే చాలా అభిమానం.ఆ అభిమానంతో పాడుబడ్డ శివాలయంను బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం బెంగళూరులో ఉండే తన సోదరి సాయం కోరాడు.ఆమె ఆర్థికంగా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.దాంతో అతడు శివాలయం పనులు ప్రారంభించాడు.

తాజాగా శివ రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు ఆడవాళ్లు రాత్రి సమయంలో శివాలయంలోనే పడుకున్నారు.

అప్పుడే కొందరు గుప్త నిధుల కోసం అంటూ వచ్చి ఆ ముగ్గురిని అత్యంత దారుణంగా చంపేయడంతో పాటు వారి రక్తంతో శివలింగంకు అభిషేకం చేయడం జరిగింది.అక్కడ క్షుద్ర పూజలు కూడా చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.దేవుడి గుడిని బాగు చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్న కారణంగా కూడా చంపి ఉండవచ్చు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడి గుడిలో గుప్త నిధులు ఉన్నాయి.వాటిని దక్కించుకునేందుకు ఇలాంటి కుట్రలు చేసి ఉంటారనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు...

కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.