నోబెల్ బహుమతి అందుకోనున్న మరో ముగ్గురు శాస్త్రవేత్తలు..!

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులల్లో నోబెల్ బహుమతి ఒకటి.తాజాగా 2021 సంవత్సరానికి ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది.

 Three More Nobel Laureates To Win, Nobel Prize , Physics, Latest News, Viral Lat-TeluguStop.com

భౌతికశాస్త్రం విభాగంలో వారికి నోబెల్ బహుమతి వరించింది.జపాన్, జర్మనీ, ఇటలీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతులను పొందనున్నారు.

భౌతికశాస్త్రం సైంటిస్టులు అయిన సుకురో మనాబో(90), క్లాస్‌ హాసిల్‌మన్‌(89), జార్జియో పారిసీ(73) లకు 2021వ ఏడాదికి గాను నోబెల్‌ బహుమతి వచ్చినట్టుగా రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మూడు విభిన్న విషయాలపై పరిశోధనలు చేశారు.

భూతాపం గురించి స్యుకురో మనాబో, క్లాస్​ హాసిల్​ మన్ పరిశోధనలు చేశారు.అదే విధంగా భౌతిక వ్యవస్థలపై పారిసీ పరిశోధనలు చేపట్టారు.

వీరు ఆ విషయాలపై పరిశోధనలు చేయడం పట్ల ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులు వరించాయి.నోబెల్ అవార్డును అందిస్తున్నట్లుగా రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

వీరి ముగ్గరికీ కూడా ఉమ్మడిగా ఈ నోబెల్ ప్రైజ్ రానుంది.అందులో జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

మిగిలిన సగం ప్రైజ్ ను స్యుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌ లకు ఇవ్వనున్నారు.నోబెల్ ప్రైజ్ తో పాటు ఇచ్చేటటువంటి ప్రైజ్‌ మ‌నీలో కూడా స‌గం పారిసీకి, మిగ‌తా స‌గం మాన‌బో, హాసిల్‌మన్‌ ల‌కు అందజేయనున్నారు.

నోబెల్‌ అవార్డ్‌ కింద బంగారు పతకం, 11 లక్షల డాలర్లు నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నారు.బహుమతి కింద వచ్చే ఈ మొత్తాన్ని కూడా ముగ్గురు శాస్త్రవేత్తలకు సమానంగా పంచనున్నట్లు అకాడమీ తెలిపింది.

స్యుకురో మ‌నాబె 1931లో జ‌పాన్‌ లోని షింగు సిటీలో జ‌న్మించి టోక్యో యూనివర్శిటీ నుంచి 1957లో పీహెచ్‌డీ పట్టా పొందారు.అలాగే క్లాస్ హాసిల్‌ మన్ కూడా 1931లో జ‌ర్మ‌నీ లోని హాంబ‌ర్గ్‌ లో పుట్టారు.

జ‌ర్మ‌నీ లోని గొట్టిన్‌జెన్ యూనివ‌ర్సిటీ నుంచి 1957లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.గియోర్గియో పారిసీ 1948లో ఇట‌లీలోని రోమ్‌ లో జ‌న్మించి రోమ్‌ లోని సెపింజా యూనివ‌ర్సిటీ నుంచి 1970లో పీహెచ్‌డీ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube