హుజురాబాద్ బరిలో నలుగురు రాజేందర్ లు !  

హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకుని చిత్ర విచిత్ర పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ఇక్కడ గెలుపే ప్రధాన ధ్యేయంగా టిఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమ ప్రధాన ప్రత్యర్ధిగా మారిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 Etela Rajendar, Hujurabad, Elections, Hujurabad Nominations, Immadi Rajendar, Es-TeluguStop.com

టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందని, అది తనకు కలిసి వస్తుందని దీంతో పాటు ఈ నియోజకవర్గంలో తనపై ఓటర్లలో సానుభూతి ఉందని, ఇవన్నీ విజయాన్ని చేకూరుస్తాయనే అభిప్రాయంతో ఈటెల రాజేందర్ ఉన్నారు.ఈ నెల 30వ తేదీన పోలింగ్ సైతం జరగబోతోంది.

దీంతో ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి.హుజూరాబాద్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.

నిన్న నామినేషన్ లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో,  దాదాపు 46 మంది నామినేషన్లను సమర్పించారు.ఈ నామినేషన్లను 11వ తేదీన పరిశీలించనున్నారు.13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉండబోతోంది.అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఈ నామినేషన్లు దాఖలు చేసిన వాళ్ళలో నలుగురు పేర్లు రాజేందర్ కావడం సంచలనంగా మారింది .ఇమ్మడి రాజేందర్ , ఈసంపల్లి రాజేందర్,  ఇప్పలపల్లి రాజేందర్ .వీరి ఇంటిపేర్లు ఈ తోనే స్టార్ట్ కావడంతో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ ఈ విధంగా ఎత్తుగడ వేసిందని, అందుకే అదే పేరుతో ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించింది అని,  దీని ద్వారా ఓటర్లను కన్ఫ్యుజ్ చేసి ఈటెల రాజేందర్ కు దక్కాల్సిన  ఓట్లను  చీల్చేందుకు టిఆర్ఎస్ ఎత్తుగడ వేసిందని రాజేందర్ వర్గీయులు విమర్శిస్తున్నారు.

Telugu Etela Rajendar, Hujurabad, Immadi Rajendar-Telugu Political News

ఇది ఇలా ఉంటే ఈ  నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన 13 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా,  43 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు.మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube