డబ్బు సంపాదించడం కోసమే మూడు పెళ్లిళ్లు చేసుకున్న కి లేడీ....

Three Marriages Prakasham District Women Cheating

మామూలుగా మన పెద్దలు పెళ్లి అంటే నూరేళ్ళ పంటని ఈ పెళ్లి ద్వారా ఒకటయినటువంటి ఆలు,మగలు జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగించాలని ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాం… కానీ ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లి పేరుతో చేస్తున్నటువంటి పనులను చూస్తుంటే పెళ్లి అనే మాటకి విలువ లేకుండా పోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.తాజాగా ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని డబ్బు కోసం తన భర్త లను వేధించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

 Three Marriages Prakasham District Women Cheating-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్వప్న అనే మహిళ ఇటీవలే ఓ ప్రముఖ సాఫ్ట్ వెర్ సంస్థలో పని చేస్తున్న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది.అయితే ఉద్యోగ రీత్యా ఆమె భర్త ఇతర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో స్వప్న ఒకరికి తెలియకుండా మరొకరిని అంటూ ముగ్గురు వ్యక్తులను పెళ్లి చేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తనని పెళ్లి పేరుతో ఎందుకు ఇలా మోసం చేశావంటూ ప్రశ్నించగా, ఇప్పుడు ఎలాగో పెళ్లి అయిపోయింది కాబట్టి నువ్వు చేసేది ఏమీ లేదని కావున తనకి అధిక మొత్తంలో డబ్బు చెల్లించి చెల్లించాలని లేదంటే పోలీస్ స్టేషన్లో గృహ హింస చట్టం కింద కేసులు పెడతానంటూ బెదిరించి సాగింది.

 Three Marriages Prakasham District Women Cheating-డబ్బు సంపాదించడం కోసమే మూడు పెళ్లిళ్లు చేసుకున్న కి లేడీ….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో యువకుడు ఏం చేయాలో తెలియక తన కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులకు పక్కా ఆధారాలతో ఈ నిత్య పెళ్లి కూతురు బాగోతం బయట పెట్టాడు.దీంతో బాధితుడు వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బుకోసం పెళ్లిళ్లు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న కి లేడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

#Marriages #Prakasham #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube