న్యూజెర్సీ వేడుకల్లో అపశృతి: కుప్పకూలిన బాల్కనీ, భారీగా క్షతగాత్రులు  

Three Levels Of Deck Collapse In New Jersey - Telugu Deck Collapse, Injuring At Least 22, New Jersey, Residential Building Collapsed, Three Levels

న్యూజెర్సీలో మూడంతస్తుల భవనానికి ఆనుకుని వున్న బాల్కనీ కూలిపోయిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో న్యూజెర్సీ ఫైర్ డిపార్ట్‌మెంట్ వార్షికోత్సవ వేడుకలను తిలకించేందుకు వైల్డ్‌వుడ్‌‌లోని ఈస్ట్ బేకర్ అవెన్యూ‌ బ్లాక్ నెం.200 వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.

Three Levels Of Deck Collapse In New Jersey

కొందరు ఆ పక్కనే ఉన్న మూడంతస్తుల నివాస సముదాయానికి ఆనుకుని ఉన్న బాల్కనీ మీదకు చేరుకున్నారు.

అయితే అది చెక్కతో చేసినది కావడం.పరిమితికి మించి జనం ఉండటంతో బాల్కనీ ఒక్కసారిగా కూలిపోయింది.

న్యూజెర్సీ వేడుకల్లో అపశృతి: కుప్పకూలిన బాల్కనీ, భారీగా క్షతగాత్రులు-Telugu NRI-Telugu Tollywood Photo Image

వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.పలువురిని రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.వీరిలో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.అయితే శిథిలాల కింద మరింతమంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Three Levels Of Deck Collapse In New Jersey-injuring At Least 22,new Jersey,residential Building Collapsed,three Levels Related....