H1B Visa : FY21లో వీసాలు పొందిన టాప్-5 కంపెనీల్లో మూడు భారతీయ సంస్థలు

గత ఆర్ధిక సంవత్సరంలో హెచ్ 1 బీ వీసాలు పొందిన టాప్ కంపెనీల్లో మూడు భారతీయ ఐటీ సంస్థలు వున్నట్లు నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికన్ పాలసీ అనే నాన్ ప్రాఫిట్ పబ్లిక్ పాలసీ ఆర్గనైజేషన్, యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ జరిపిన అధ్యయనం తెలిపింది.అమెజాన్ సంస్థ వరుసగా రెండవ సంవత్సరం అత్యధిక సంఖ్యలో హెచ్ 1 వీసాలను పొందింది.

 H1b Visa : Fy21లో వీసాలు పొందిన టాప్-5 క�-TeluguStop.com

ఆ తర్వాత ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ వున్నాయి.

ఈ కంపెనీల వీసా తిరస్కరణ రేటు కూడా గణనీయంగా తగ్గినట్లు అధ్యయనం తెలిపింది.

ప్రాసెసింగ్ సమస్యలు, వ్యాజ్యాల కారణంగా ఆమోదించిన వీసాల సంఖ్య పెరిగే అవకాశం వుంది.దీంతో ఎఫ్‌వై 20లో దాఖలు చేయబడిన పిటిషన్‌లు ఎఫ్‌వై 21లో క్లియర్ అయ్యాయి.

ఎఫ్‌వై 20తో పోలిస్తే ఎఫ్‌వై 21లో దాదాపు 18000కు పైగా పిటిషన్లు ఆమోదించారని అంచనా.వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు ఎఫ్‌వైలో 18, 19లో 12 శాతం వుండగా.

ఎఫ్‌వై 21లో ఇది 2 శాతానికి తగ్గడం విశేషం.

కాగా.

నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

మరోవైపు హెచ్1 బీ వీసాదారులకు తక్కువ వేతనం చెల్లిస్తున్నట్లుగా భారత ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌‌పై అమెరికన్ థింక్ ట్యాంక్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది.అంతర్గత హెచ్‌సీఎల్ డాక్యుమెంట్ల విశ్లేషణ ఆధారంగా నోయిడా కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ హెచ్ 1 బీ వీసాదారులకు అమెరికాలోని తోటి సంస్థలతో పోలిస్తే 95 మిలియన్ డాలర్ల వరకు తక్కువ వేతనాలు చెల్లించినట్లుగా ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఈపీఐ) పేర్కొంది.డిస్నీ, ఫెడెక్స్, గూగుల్ తదితర సంస్థల్లో సబ్ కాంట్రాక్టర్లుగా హెచ్‌సీఎల్‌కు చెందిన వేలాది మంది హెచ్ 1 బీ వీసాదారులు పనిచేస్తున్నారు.

వీరికి కనీసం 95 మిలియన్ డాలర్లకు పైగా తక్కువ వేతనం చెల్లించినట్లుగా ఈపీఐ ఆరోపిస్తోంది.బాధితుల్లో హెచ్ 1 బీ వీసాదారులే కాకుండా పలువురు అమెరికన్ నిపుణులు కూడా వున్నట్లు తెలుస్తోంది.

Three Indian IT Cos Among Top 5 Recipients Of H-1B Visas In FY21 , Economic Policy Institute, Amazon Company, US Citizenship And Immigration Service, Non Profit Public Policy Organization, H1B Visa, American Think Tank On HCL Technologies - Telugu Amazon Company, Economicpolicy, Hb Visa, Public Policy, Indiancos, Citizenship

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube