ముగ్గురు భారతీయులకు భారీ జాక్ పాట్....!!!

అదృష్టం ఎప్పుడు ఎవరిపై ఎలా కరుణ చూపిస్తుందో ఎవరికీ తెలియదు.చెప్పి వస్తే అది అదృష్టం ఎలా అవుతుందిలెండి.

 Three Indian Expats Bag Rs 2.67 Lakh Each In Mahzooz Draw,mahzooz Draw, Indian E-TeluguStop.com

కొందరికి అదృష్టం తలుపు తెరిచే వరకూ తడుతూనే ఉంటుంది.పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్ళిన వారికి అదే దేశంలో లక్షల డబ్బు లక్కీ డ్రా లో గెలుచుకుంటే ఎలా ఉంటుంది అలాంటి అదృష్టమే గల్ఫ్ దేశంలో ఉపాది కోసం వెళ్ళిన మన భారత సంతతి వ్యక్తులు ముగ్గురిని వరించింది.

వివరాలలోకి వెళ్తే.

భారత్ కి చెందిన సుబ్రహ్మణ్యం, ఇబ్రహీం, సుబాష్ చంద్ర ఈ ముగ్గురు వ్యక్తులు ఎన్నో ఏళ్ళ క్రితమే ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళారు.

సుబ్రహ్మణ్యం మొదట్లో యూఏఈ లో ఉండగా తరువాత షార్జా లో స్థిరపడ్డారు.తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు అక్కడి దేశంలో అధికారికంగా నిర్వహించే మహాజూజ్ వీక్లీ డ్రా లో పాల్గొనే వాడు.

అయితే ఊహించని విధంగా కొన్ని రోజుల క్రితం మహాజూజ్ లాటరీలో ఏకంగా లక్షదిన్హార్లు గెలుచుకున్నాడు.ఇదే విధంగా

ఇబ్రహీం కూడా ఎన్నో ఏళ్ళ క్రితమే సౌదీ అరేబియాలో ఓ స్టోర్ నడుపుతున్నాడు.

ఇబ్రహీం కూడా గతంలో ఎన్నో సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించాడు కానీ ఉపయోగం లేకుండా పోయింది.దాంతో చివరి సారిగా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

అయితే లాటరీలో తాను కొన్న టిక్కెట్టు నెంబర్ ఉండటం చూసి ఇబ్రహీం నోట మాట రాలేదు.ఈయనకు సైతం లాటరీలో లక్ష దినార్లు గెలుపొందాడు ఈ డబ్బును తాను తన కూతురి పెళ్లి కోసం దాచుకుంటానని తెలిపాడు.

ఇదిలాఉంటే కూలి పనికోసం ఎన్నో ఏళ్ళ క్రితమే సౌదీ వెళ్ళిన సుబాష్ చంద్ర కూడా ఇదే తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అతడు కూడా లక్ష దినార్లు గెలుచుకున్నాడు.ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కరు లక్ష దినార్లు గెలుచుకోవడమే.ఇంతకీ లక్ష దినార్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.20 .50 లక్షలు పై మాటేనట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube