భారత్‌కు ‘‘ఊపిరి’’ కోసం... 2 కోట్ల విరాళాలు, ముగ్గురు ఎన్ఆర్ఐ బాలల సంకల్పం

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మరే ఇతర దేశంలో లేని విధంగా ప్రతి రోజూ మూడున్నర లక్షలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.

 Three Indian American Siblings Raise Over Usd 28 Lakh For Medical Supplies In In-TeluguStop.com

కేసుల పెరుగుదలతో దేశంలోని ఆసుప్రత్రులపై ఒత్తిడి పెరుగుతోంది.చాలా వరకు హోం ఐసోలేషన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నప్పటికీ.

ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుండటంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.దీంతో బెడ్లు, ఆక్సిజన్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

బెడ్లు దొరుకుతున్నా సకాలంలో ఆక్సిజన్ లభించక కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.ఈ విపత్కర పరిస్ధితి నుంచి బయట పడేందుకు భారత్ అందుబాటులో వున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది.

అటు ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం సైతం ముందుకొస్తుంది.ఈ క్రమంలో కోవిడ్ వల్ల భారత్‌ పడుతున్న ఇబ్బందులు.

ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్న సంఘటనల్ని టీవీలో చూసిన ముగ్గురు ఎన్ఆర్ఐ బాలురు తమ వయసును సైతం పక్కనబెట్టి ఇండియాకు ఏమైనా చేయాలనుకున్నారు.దీనిలో భాగంగా ఫైండ్ రైజింగ్ ద్వారా దాదాపు రూ.2 కోట్లు సేకరించారు.

వివరాల్లో వెళితే.

అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబానికి చెందిన గియా గుప్తా, కరీనా గుప్తా, అర్మాన్ గుప్తాలు కవలలు.వీరి అందరి వయసు (15) సంవత్సరాలే.

అయితే తోటివారికి సాయం చేయాలనే తపన చిన్నప్పటి నుంచే ఎక్కువ.దీనిలో భాగంగా ‘లిటిల్ మెంటర్స్’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు.

ఇదిలావుండగా.ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌తో భారత్‌లోని పరిస్థితులు, ఆక్సిజన్ కొరతతో జనం మరణిస్తున్న విషయాన్ని ఈ బాలురు టీవీలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు.

వెంటనే తమకు తోచిన సాయం చేసి ప్రాణాలు నిలబెట్టాలనుకున్న ఈ పిల్లలు.స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద విరాళాల సేకరణ మొదలెట్టారు.

ఈ క్రమంలో 2.80 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.2 కోట్లు) పొగు చేశారు.లిటిల్ మెంటర్స్ సంస్థ ద్వారా ఇండియాలోని పరిస్దితులను స్నేహితులు, వారి బంధువులకు అర్ధమయ్యేలా వివరించారు.

ఇంత చిన్న వయసులో వారి సంకల్పాన్ని మెచ్చిన పెద్దలు సైతం సాయం చేయడంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు గుప్తా సోదరులు.ఈ నిధుల ద్వారా కరోనా రోగులకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి, వాటిని భారత్‌లోని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని బాలురు తెలిపారు.

ప్రస్తుతం కోవిడ్‌ సంక్షోభం వేళ ఒకరినొకరు సాయం చేసుకుని ఆపద నుంచి బయటపడాలని చిన్నారులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube