ఒక్క ప్రియుడు.ముగ్గురు ప్రేయసిలు.
వీరి ప్రేమ చివరకు సీన్ సితారైంది.ఓ రోమాంటిక్ కుర్రాడు.
ఒకరికి తెలియకుండా ఒకరికి మాయ మాటలు చెప్పి ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాడు.ఓ రోజు అతని బండారం బయటపడింది.
ఇంకేముంది ముగ్గురమ్మాయిలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అంతా భావించారు.కానీ అక్కడే సీన్ రివర్స్ అయ్యింది.
ఈ ప్రియుడు నాకు కావాలంటే నాకు కావాలంటూ ప్రియురాళ్లు జుట్టుపట్టుకొని కొట్టుకోసాగారు.మధ్యలో ప్రియుడు ఎంత ఆపుదామని ట్రై చేసినా సాధ్యం కాలేదు.
ముగ్గురు ప్రియురాళ్లు కొట్టుకుంటున్న ఈ ప్రేమ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమాల ప్రభావంమో.సొషల్ మీడియా నిర్వాకమొ తెలియదు కానీ రాను రాను యువత ఆలోచనా విధానాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.తాజాగా జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహరనగా నిలిచింది.
కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ఈ సంఘటన పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.దీంతో హుబ్లీ లవర్స్ స్ట్రీట్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వివరాలలోకి వెళ్తే.హుబ్లీలోని ఓ కాలేజీ చదువుతున్న కుర్రాడు.తన క్లాసులోని ముగ్గురు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు.ముగ్గురిని ప్రేమిస్తూ.
ప్రేమించబడుతూ ఒకరికి తెలియకుండా ఒకరితో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
watch video:
కానీ ఓ శుభ ఉదయాన ఈ ప్రేమికుడి ప్రేమ వ్యవహారానికి ఊహించని ఎండ్ కార్డ్ పడింది.ఒకరికి తెలియకుండా ఒకరిని కలిసేందుకు వచ్చిన ఈ కుర్రాడికి ముగ్గురు ఒకేసారి కలువడంతో ఖంగుతిన్నాడు.అయితే ముగ్గురూ కలిసి అతడికి బడితె పూజ చేస్తారని భయపడ్డాడు.
కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది.ఆ ముగ్గురు అమ్మాయిలు ఈ ప్రియుడు తమ వాడేనంటూ నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు.
నాకు కావాలంటూ నాకు అంటూ కొట్టుకుంటున్న ప్రియురాళ్లను సముదాయించేందుకు ఈ ప్రియుడు నానా తంటాలు పడ్డాడు.