అమెరికాలో ప్రతీ నలుగురిలో ముగ్గురికి - హెచ్‌-1బీ వీసా     2018-10-21   11:30:34  IST  Surya Krishna

అమెరికాలో తాజాగా వెల్లడించిన నివేదికల ప్రకారం ప్రతీ నలుగురిలో ముగ్గురు హెచ్‌-1బీ వీసాకలిగి ఉన్నారని అమెరికా అమెరికా పౌరుల వలస సేవల విభాగం వెల్లడించింది..ఈ నివేదిక ప్రకారం చూస్తే యూఎస్‌ అక్టోబరు5 నాటికి 4,19,637 మంది విదేశీయులు హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్నారు…అయితే వీరిలో 3,09,986 మంది భారతీయులు ఉన్నారని యూఎస్‌సీఐఎస్‌ నివేదికలో తెలిపింది.

Three-fourths Of H1B Visa Holders In 2018 Are Indians-

Three-fourths Of H1B Visa Holders In 2018 Are Indians

హెచ్‌-1బీ వీసాదారుల్లో లింగ వివక్ష కూడా అధికంగా ఉందని తన నివేదిక లో పేర్కొంది.. ప్రతి నలుగురు హెచ్‌-1బీ వీసాదారుల్లో ఒక మహిళ మాత్రమే ఉన్నారని తెలిపింది. 4,19,637 మంది హెచ్‌-1బీ వీసాదారుల్లో 1,06,096 మంది మహిళలు, 3,11,997 మంది పురుషులు ఉన్నారని..భారతీయుల్లోనూ లింగ అసమానత్వం అధికంగా ఉందని నివేదిక వెల్లడించింది. అమెరికాలో 3,09,986 మంది భారతీయులు ఉండగా వారిలో కేవలం 63,220 (20.4 శాతం) మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపింది.

అయితే ఈ లెక్కల్లో భారతీయుల తర్వాత స్థానంలో చైనీయులు ఉన్నట్టు యూఎస్‌సీఐఎస్‌ నివేదిక వెల్లడించింది. భారత్‌తో పోలిస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. 73.9 శాతం మంది భారతీయులు హెచ్‌-1బీ వీసాపై ఉండగా కేవలం 11.2 శాతం మంది మాత్రమే చైనీయులు ఉన్నారు. 47,172 మంది చైనీయులు హెచ్‌-1బీపై అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే, చైనీయుల్లో లింగ అసమానత్వం ఎక్కువగా లేదని తెలిపింది.