ఈవార్తలో నిజమెంతో..! ఒక్క పాట కోసం 3కోట్లు.. ఖర్చుకి వెనక్కి తగ్గని రాజమౌళి..!

ఒక పాట కోసం మూడు కోట్లు బడ్జెట్ వెచ్చించిడం అంటే ఆశ్చర్యపరిచే విషయమే.కానీ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఆ వార్త పెద్ద మేటర్ కానే కాదు.

 Three Crores For One Song In Rrr Rajamouli Who Is Not Stepping Back In Budget-TeluguStop.com

తానూ అనుకున్నట్లుగా సినిమాలో మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు.ఆయనకు తగ్గట్టుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్  పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు.

మళ్లీ ఎందుకు ఈ చర్చని అనుకుంటున్నారా.? రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆర్ ఆర్ ఆర్” ఓ పాట ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ పాట రూపుదిద్దుకోనుంది.కేవలం ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్లు వెచ్చించనున్నారట.రామోజీ ఫిలిం సిటీలో ఆ సాంగ్ ను చిత్రీకరించినట్లు సమాచారం.అందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సందడి చేయనున్నట్లు తెలిసింది కాస్ట్యూమ్స్ కోసం దాదాపు కోటి వరకు ఖర్చు చేయనున్నారట.

 Three Crores For One Song In Rrr Rajamouli Who Is Not Stepping Back In Budget-ఈవార్తలో నిజమెంతో.. ఒక్క పాట కోసం 3కోట్లు.. ఖర్చుకి వెనక్కి తగ్గని రాజమౌళి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.పాన్ ఇండియా చిత్రం “ఆర్ ఆర్ ఆర్” గతంలో ప్రకటించిన తేదీకి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu Ajay Devgan, Alia Bhattt, Bollywood, Budget, Keeravani, Ntr, One Song, Pan India Movie, Rajamouli, Ram Charan, Rrr, Rrr Movie Update, Three Crores, Tollywood-Movie

రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది.అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథలతో రూపొందుతున్న చిత్రమిది.బాలీవుడ్ అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.డి.వి.వి.దానయ్య నిర్మాత.

#Ajay Devgan #Three Crores #Rajamouli #One Song #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు