హైదరాబాద్ లో తుఫాన్ ఎఫెక్ట్... ఆచార్య కి 3 కోట్లు నష్టం

హైదరాబాద్ మహా నగరానికి తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగా తాకింది.మహానగరాలైన ముంబై, చెన్నై, బెంగుళూరు ఎక్కువగాముంపుకి గురవుతూ ఉంటే హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు.

 Three Crores Acharya Movie Set Collapsed Due To Tufan, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

అయితే అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని భీభత్సం చవిచూడాల్సి వచ్చింది.లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.

తుఫాన్ దాటికి కాలువలు, మూసి నది, చెరువులు పొంగి ప్రవహించడంతో కాలనీలలోకి మోకాళ్ళ లోతు నీరు వచ్చేసింది.కొన్ని లోటాత్తు ప్రాంతాలలో అయితే జలవిలయం కనిపించింది.

నాదీ ప్రవాహనాన్ని తలపించే విధంగా రహదారులపై వరద నీరు పరుగులు పెట్టింది.ఈ తుఫాన్ ధాటికి వందల సంఖ్యలో కారులు కొట్టుకుపోయాయి.

పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.రెండు రోజుల పాటు ప్రజలు ఎవరు ఇళ్లనుంచి బయటకి రావొద్దు అన్నారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ తుఫాన్ భీభత్సానికి షూటింగ్ లు అన్ని కూడా బంద్ అయిపోయాయి.స్టూడియోలలో సినిమా షూటింగ్ కోసం నిర్మించిన సెట్స్ కూడాపూర్తిగా ధ్వసం అయ్యాయి.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకి తుఫాన్ దెబ్బ గట్టిగానే తగిలింది.సిటీ బయట ఈ సినిమాలో కీలక సన్నివేశాల కోసం వేసిన ఒక హౌస్ సెట్ ధ్వంసం అయ్యి పూర్తిగా కూలిపోయే దశకి వచ్చేసిందని తెలుస్తుంది.

ఈ సెట్ ని సుమారు మూడు కోట్లు పెట్టి నిర్మించారని సమాచారం. ఆచార్య షూటింగ్ మళ్ళీ ప్రారంభించడానికి రెడీ అయ్యి ఈ మూడు కోట్లరూపాయిల సెట్స్ ఏర్పాటు చేసారని షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ సెట్ ధ్వంసం కావడంతో నిర్మాత రామ్ చరణ్ పెట్టిన ఖర్చు తుఫాన్ లో కొట్టుకుపోయినట్లు అయ్యిందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube