సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు… ఆ ముగ్గురు నిందితులే  

Three Booked In Actress Sravani Suicide Case, Social Media, Women Harassment, Actress Sravani, Devaraj Reddy, Tollywood - Telugu Actress Sravani, Devaraj Reddy, Social Media, Three Booked In Actress Sravani Suicide Case, Tollywood, Women Harassment

ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు సోషల్ మీడియాలో ప్రభావంతో, లేదంటే కల్చర్ ప్రభావం కారణంగా మంచితనం అనే ముసుగు వేసుకొని అబ్బాయిలు చేసే మోసాలకి బలైపోతున్న ఘటనలు తరుచుగా చూస్తూ ఉన్నాం.వారిలో అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని నమ్మించి వాడుకోవడం తరువాతం తప్పించుకొని వదిలించుకోవడం చేస్తూ ఉంటారు.

TeluguStop.com - Three Booked In Actress Sravani Suicide Case

ఇప్పుడు సీరియల్ యాక్టర్ శ్రావణి ఆత్మహత్య ఘటన కూడా ఈ కోవలోనే వస్తుంది.గత కొంత కాలంగా తెలంగాణలో హాట్ టాపిక్ అయిన శ్రావణి ఆత్మహత్య కేసులో ఆమె ప్రియులుగా ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయి చుట్టూ కేసు అల్లుకుంది.

ఇద్దరు కూడా తమకి ఆమె ఆత్మహత్యతో సంబంధం లేదని చెప్పడానికి ఆడియో రికార్డింగ్ లని బయటపెట్టారు.అయితే ఈ కేసు విచారించిన పోలీసులు చివరికి శ్రావణి ఆత్మహత్యకి వాళ్ళిద్దరితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డి కూడా కారణం అని నిర్ధారించుకున్నారు.

TeluguStop.com - సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు… ఆ ముగ్గురు నిందితులే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే వారి అదుపులో ఉన్న దేవరాజ్ రెడ్డి, సాయిని అరెస్ట్ చేశారు.ఇక అశోక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

ఇక ఈ కేసు వివరాలని పోలీసులు తెలియజేశారు.కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు చెందిన శ్రావణి సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది.టీవీ ఆర్టిస్టుగా అవకాశాల కోసం ప్రయత్నించింది.ఈ క్రమంలో 2015లో శ్రావణికి సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది.వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు.2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది.అశోక్ రెడ్డి నిర్మించిన ప్రేమతో కార్తీక్ అనే చిత్రంలో శ్రావణి చిన్న పాత్ర పోషించింది.అప్పటి నుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది.2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డి పరిచయం అయ్యాడు.టిక్ టాక్ వీడియోలతో వీరికి పరిచయం ఏర్పడింది.

దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు.అప్పటి నుంచి శ్రావణిని సాయికృష్ణ తల్లిదండ్రులతో కలిసి వేధించేవాడు.

అలాగే అశోక్ రెడ్డి కూడా ఆమెపై వేధింపులకి పాల్పడ్డాడు.అయితే దేవరాజ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆమెకి అతని నుంచి కూడా తిరస్కరణ ఎదురవడంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్యకి ఈ ముగ్గురుకూడా కారణం అయినట్లు ఆడియో టేపులు, చాటింగ్ మెసేజ్ ల ద్వారా నిర్ధారణ కావడంతో వారిపై కేసు నమోదు చేసింట్లు తెలిపారు.అయితే వీరిలో ఎ1 గా సాయికృష్ణ, ఎ2గా అశోక్ రెడ్డి, ఎ3గా దేవరాజ్ రెడ్డిని చేర్చినట్లు తెలియజేశారు.

అమ్మాయి అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళు ముగ్గురు ఆమె జీవితంతో ఆడుకున్నారని దీనిని బట్టి తెలుస్తుంది.మొత్తానికి ఈ కేసులో ముగ్గురుని నిందితులుగా చేర్చడం ద్వారా శ్రావణి కేసుకి మిగింపు పలికినట్లు అయ్యింది.

#Actress Sravani #Devaraj Reddy #Social Media #ThreeBooked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Three Booked In Actress Sravani Suicide Case Related Telugu News,Photos/Pics,Images..