2022 సంక్రాంతికి వారంలో వెయ్యి కోట్లు సాధ్యమా?

టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి అంటే ఖచ్చితంగా మంచి సినిమాలతో పండగ వాతావరణం వస్తుంది.ప్రతి సంక్రాంతికి రెండు మూడు సినిమాలు ఉండటం చాలా కామన్ విషయం.

 Three Big Movies Coming To 2022 Sankranti-TeluguStop.com

ఇంత కరోనా సమయంలో కూడా ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలు వచ్చాయి.అలా తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే సినిమాల పండుగ అయ్యింది.

అలాంటి సినిమాల పండుగకు మహేష్‌ బాబు సర్కారు వారి పాట, పవన్‌ కళ్యాణ్‌ రానాల సినిమాతో పాటు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌ ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.ఈ మూడు సినిమాల విడుదల తేదీలపై అధికారికంగా ఆప్రకటన వచ్చింది.

 Three Big Movies Coming To 2022 Sankranti-2022 సంక్రాంతికి వారంలో వెయ్యి కోట్లు సాధ్యమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మూడు సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి అనుకోవడానికి కూడా లేదు.ఒకటి రెండు రోజుల గ్యాప్‌ లోనే అంటే వారంలోనే మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు లేదా పెద్ద సినిమాలు కూడా విడుదల అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఇంతగా హడావుడి ఉన్న సంక్రాంతికి రాబోతున్న సినిమాలు వెయ్యి కోట్లు వసూళ్లు చేస్తే కాని బ్రేక్ ఈవెన్‌ సాధ్యం కాదు అలాంటి పరిస్థితిలో సంక్రాంతికి సినిమాలు విజయాన్ని సొంతం చేసుకుని ఆ మొత్తంను సాధిస్తాయా అనేది చూడాలి.

వసూళ్లు పక్కన పెడితే ఒకటి రెండు నెలల్లో థర్డ్‌ వేవ్‌ అంటే పరిస్థితి సంక్రాంతికి బొమ్మ పడటమే కష్టం.

Telugu Corona Third Wave, Mahesh Babu, One Thousnad Crores, Pawan Rana Movie, Prabhas, Radeshyam, Sankranti Movies, Sarkaru Vaar Pata, Theaters-Movie

అందుకే సినిమాల విడుదల వరకు ఏమీ మాట్లాడలేము అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.మహేష్‌ బాబు సర్కారు వారి పాట మరియు పవన్ సినిమా ల షూటింగ్‌ లు జరుగుతున్నాయి.రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ ముగిసింది.

ప్రభాస్ విడుదల విషయంలో ఎలాంటి డౌట్ లేదు.కాని ఆ ఇద్దరు హీరోల సినిమాల విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.

#Mahesh Babu #Theaters #Prabhas #OneThousnad #Radeshyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు