నిగ్గదీసి అడుగు అన్న ఉదయభానుకి చంపేస్తామంటూ బెదిరింపులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఒకప్పుడు బుల్లితెరపై తన గలగల మాటలతో యాంకరింగ్ చేసి ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్ ఉదయభాను. తన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

 Threats To Kill Udayabhanu Do You Know What Happened,  Udayabhanu, Tollywood, An-TeluguStop.com

కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా పలు సినిమాలలో నటించింది.ఎంతో పొడవుగా, ఆకట్టుకునే అందంతో ఉంటూ ఏ భాషలోనైనా చక్కగా మాట్లాడుతూ అందర్నీ ఫిదా చేస్తుంది.
ఈమె వెండితెరకు ఎర్రసైన్యం సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.ఇక స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.బుల్లితెరపై యాంకర్ గా అడుగు పెట్టి ఎన్నో రియాలిటీ షోలకు, ఎంటర్టైన్మెంట్ షోలకు వ్యాఖ్యాతగా చేసింది.

అంతేకాకుండా కొన్ని సీరియల్స్ లలో కూడా నటించింది.

ఈమె వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఈమె సమాజం పట్ల బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.సమాజంలో జరిగే అన్యాయాలపై బాగా ప్రశ్నలు వేస్తోంది.

సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండకపోయినా అప్పుడప్పుడు సమాజానికి సంబంధించిన విషయాలపై బాగా స్పందిస్తుంది.

Telugu Actress, Anchor, Threats, Tollywood, Udayabhanu-Movie

ఇదిలా ఉంటే గతంలో ఉదయభానుకి చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.ఇంతకూ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.గత కొన్ని సంవత్సరాల కిందట ఉదయభాను రాజకీయ నాయకులను నిలదీయడానికి టీవీ9 ఛానల్ లో ఓ ప్రోగ్రాం చేసింది.

ఆ ప్రోగ్రాం కు నిగ్గదీసి అడుగు అనే పేరు కూడా పెట్టారు.

ఇక ఈ షోపై ఉదయభాను ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలిసి వారి రాజకీయ పాలన గురించి అడిగి తెలుసుకునేది.

అంతేకాకుండా వారు చేసిన తప్పులను కూడా గట్టిగా నిలదీసేది.దీంతో ఆమె మీడియా ముందు అలా ప్రశ్నించే సరికి కొంత మంది రాజకీయ నాయకులు ఆమెను చంపేస్తామని బెదిరించారట.

Telugu Actress, Anchor, Threats, Tollywood, Udayabhanu-Movie

ఈ విషయం గురించి ఉదయభాను గతంలో స్పందించింది.తనకు చిన్నప్పటి నుండి సమాజంలో జరిగే తప్పులను స్పందించాలనే ఆలోచన ఉండేదని అందుకే అలాంటి తరహా లో ఈ ప్రోగ్రాం చేస్తున్నానని తెలిపింది.ఈ ప్రోగ్రాం ద్వారా పవర్ ఫుల్ రాజకీయ నాయకులను కలిశానని తెలిపింది.అందులో కొందరు తనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా చేశారని.కానీ వాటిని అస్సలు లెక్క చేయనని గట్టిగా చెప్పేసింది ఉదయభాను.

Telugu Actress, Anchor, Threats, Tollywood, Udayabhanu-Movie

అలా ఈ ప్రోగ్రాం వల్ల కేవలం రాజకీయ నాయకులనే కాకుండా సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలతో కూడా మాట్లాడింది.చాలా వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రజల సమస్యలను అడిగి మరీ తెలుసుకుంది.దీంతో ఈమె రాజకీయాల్లోకి అడుగు పెడతాదని కూడా చాలా వరకు అనుకున్నారు.

కానీ తనకు అందులో ఇంట్రెస్ట్ లేదని తెలిసింది.ఇక 2004లో ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్నాక కూడా ఇండస్ట్రీలో కొంత కాలం పని చేసింది.

తనకు పిల్లలు పుట్టాక ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube