కమలా హారిస్ ను చంపేస్తానని బెదిరింపులు.. యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.. !

కొందరు చేసే పనులను చూస్తే అది పిచ్చో, వెర్రినో అర్ధం కాదు.ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా ప్రతి వారికి అందుబాటులో ఉండటం వల్ల దీన్ని వేదికగా చేసుకుని చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.

 Threats To Kill Kamala Harris Us Police Arrest 39 Years Nurse , America, Vice Pr-TeluguStop.com

ఇలాగే చేసిన ఓ యువతి ఊచలు లెక్కపెడుతుంది.ఆ వివరాలు చూస్తే.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను చంపేస్తానని బెదిరించిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు.ఫ్లోరిడాలో పనిచేస్తున్న నివియనీ పిట్టిట్ ఫెల్ఫ్స్ అనే నర్సు, కమలా హారిస్ ను హత్య చేస్తానని వివాద స్పదంగా వ్యాఖ్యానించింది.

కాగా ఈ విషయంలో విచారణ జరిపిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఆమెను అరెస్ట్ చేసింది.కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు, నీకు రోజులు దగ్గర పడ్డాయని ఆమె వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఇకపోతే ఈ మహిళ నల్లజాతి స్త్రీ కావడం, అమెరికాలో నల్లజాతీయుల పై జరుగుతున్న దాడుల నేపధ్యంలో ఆగ్రహాంతో, ఈ బెదిరింపులకు పాల్పడ్డదని భావిస్తున్నారట అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube