పాపం.. ఆ సినిమా విషయంలో హీరో రాజశేఖర్ కు బెదిరింపులు.. ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Threats To Hero Rajasekhar About That Movie What Happened , Rajesekhar, Tollywoo-TeluguStop.com

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ ఎన్నో ప్రేమ కథ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో  నటించి విశేషమైన ఆదరణ దక్కించుకున్నారు.ఈ క్రమంలో రాజశేఖర్ నటి జీవితతో ప్రేమలో పడిన అనంతరం ఆమెను వివాహం చేసుకున్నారు.

ఇప్పటికీ రాజశేఖర్ పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా రాజశేఖర్ సినీ కేరియర్ లో ఒక సినిమా విషయంలో అతనికి పెద్ద ఎత్తున బెదిరింపులు రావడం చేత ఈ సినిమా ఆరంభంలోనే ఆపివేశారు.

అయితే ఆ సినిమా ఏంటి? ఈ సినిమాను చేయటం వల్ల అతనికి ఎందుకు బెదిరింపులు వచ్చాయి అనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న ముఖ్యమంత్రులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు.ఇతని మరణానంతరం అతని బయోపిక్ చిత్రం చేయాలని దర్శకుడు పూరిజగన్నాథ్ భావించారు.

సాధారణంగా ఎంతో మంది రాజకీయ నాయకులు, క్రికెటర్లు సినీ ప్రముఖుల బయోపిక్ చిత్రాలు తెరకెక్కించడం సర్వసాధారణం.

Telugu Rajesekhar, Threats, Tollywood-Movie

ఈ క్రమంలోనే రాజశేఖరరెడ్డి మరణాంతరం బయోపిక్ చిత్రంలో రాజశేఖర్ హీరోగా డా.రాజశేఖర్ రెడ్డి అనే టైటిల్ తో సినిమాన్ని తెరకెక్కించాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.అప్పటికే స్క్రిప్ట్ పనులను ప్రారంభించిన పూరి జగన్నాథ్ రాజశేఖర్ రెడ్డి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాని ప్రకటించిన కొన్ని రోజులకు హీరో రాజశేఖర్ కు రెడ్డి సంఘాల నేతల నుంచి పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయి.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎలాంటి కులమత విభేదాలు లేకుండా సినిమా తీయాలని చెప్పారు.

Telugu Rajesekhar, Threats, Tollywood-Movie

వైయస్ అంటేనే గౌరవభావం కలిగించే విధంగా సినిమా ఉండాలి అని వారు రాజశేఖర్ ను బెదిరించారు.ఇలా రెడ్డి సంఘాల వారు హీరో రాజశేఖర్ ను బెదిరించడానికి గల కారణం ఈ సినిమాలో రెడ్డి కులానికి సంబంధించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని బయటకు తెలియడంతో వారు ఇలాంటి సన్నివేశాలను సినిమాలో పెట్టడానికి వీలు లేదంటూ హీరో రాజశేఖర్ ను బెదిరించారు.ఈ విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాకుండానే ఇలా రెడ్డి సంఘాల నుంచి బెదిరింపులు రావడంతో కొన్ని రోజులపాటు ఈ సినిమాని పక్కన పెట్టారు.

ఈ విధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రం రావాల్సి ఉండగా ఇలాంటి కారణాల వల్ల ఈ చిత్రం స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది.

ఇక కొన్ని రోజులకు ముమ్మట్టి రాజశేఖర పాత్రలో ఆయన రాజకీయ జీవితం ఆధారంగా యాత్ర సినిమా వచ్చింది.ఇక ఈ సినిమా రావడంతో పూరి జగన్నాథ్ తన రాజశేఖర్ రెడ్డి చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube