అన్ని బ‌య‌ట‌ పెట్టేస్తా అంటూ అజయ్ ఘోష్‌కు బెదిరింపులు.. లీకైన ఆడియో నెట్టింట హల్‌చల్?

కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీలు , రాజకీయ నాయకులకు సంబంధించిన కొన్ని రకాల ఆడియో క్లిప్ లు, వీడియోలు బాగా హాట్ టాపిక్ గా మారుతుంటాయి.ఇక వాటిని పరిశీలించినట్లయితే అందులో వారికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు బయటపడుతుంటాయి.

 Threats To Ajay Ghosh And Leaked Audio Calls Viral In Social Media, Ajay Ghosh,-TeluguStop.com

ఇక అవి నెట్టింట్లో వైరల్ గా మారడంతో బాగా హల్ చల్ చేస్తుంటాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ నటుడు అజయ్ ఘోష్ కు సంబంధించిన ఆడియో కూడా లీక్ అయ్యింది.

తెలుగు సినీ నటుడు అజయ్ ఘోష్ గురించి అందరికీ తెలిసిందే.చాలా వరకు నెగటివ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించాడు.ఇక ఈయన తెలుగులో పలు సినిమాలలో నటించగా కొన్ని కొన్ని సహాయ పాత్రలలో కూడా నటించాడు.

ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఇతడు ఒక మహిళ తో మాట్లాడిన ఆడియో టేప్ లీక్ అయింది.

ప్రస్తుతం ఆ ఆడియో యూట్యూబ్ లో బాగా హల్ చల్ గా మారింది.అందులో అప్పడాల విజయలక్ష్మి అనే ఒక మహిళ ఏకంగా అజయ్ ఘోష్ నే ట్రాప్ చేసింది.

పైగా అతనితో బాగా డిమాండ్ గా మాట్లాడింది.ఇక తాను అడిగింది కాదంటే తమ విషయాలు అన్ని బయటకు చెప్పేస్తాను అంటూ బెదిరించింది.

Telugu Ajay Ghosh, Appadalavijaya, Blackmail, Maruthi, Leaked, Manchirojulu-Movi

అప్పడాల విజయలక్ష్మి అజయ్ ఘోష్ కు ఫోన్ చేసి ఇద్దరం ఓకే కాలనీలో ఉంటున్నాము అంటూ తాను అప్పడాలు తయారు చేస్తాను అని అజయ్ తో అన్నది.ఇక అజయ్ ఎవరు నువ్వు అంటూ అసలు విషయం చెప్పమని ప్రశ్నించాడు.ఇక ఆమె మాట్లాడుతూ మారుతి గారు డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి‘ సినిమాలో మీరు నటించారని ఆ సినిమా నవంబర్ 4న విడుదల చేయనున్నారట అందుకు ఆ సినిమాకి మీరే నన్ను తీసుకెళ్లాలి అంటూ అజయ్ తో డిమాండ్ చేసింది.

Telugu Ajay Ghosh, Appadalavijaya, Blackmail, Maruthi, Leaked, Manchirojulu-Movi

వెంటనే అజయ్ నేను అటువంటి వ్యవహారాల మనిషిని కాను అంటూ మీకు వెళ్లాలి అనిపిస్తే మీరు వెళ్ళండి అని అన్నాడు.ఆమె అంతటితో ఆగకుండా దీపావళి రోజు నవంబర్ 4 న ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాకు మీరు తీసుకెళ్లకపోతే మీ జేబులో మతాబులు వెలిగిస్తాను అంటూ గట్టి షాక్ ఇచ్చింది.అంతేకాకుండా రోజు ఇంట్లో వాళ్ళతో ఏం వెళ్తారు నాతో సినిమాకు రండి అని గట్టిగా చెప్పేసింది.

ఒకవేళ మీరు సినిమాకి తీసుకెళ్ళకపోతే నాతో చేసిన విషయాలన్నింటిని బయటికి చెప్పేస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది.

Telugu Ajay Ghosh, Appadalavijaya, Blackmail, Maruthi, Leaked, Manchirojulu-Movi

ఇక ఇదంతా విన్నాక అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.కొందరు ఇదేదో సినిమా గురించి హింట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది అని అనుకున్నారు.కానీ మొత్తానికి సినిమా గురించే చేశారు అని తెలిసింది.

డైరెక్టర్ మారుతి రావు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇక ఈ సినిమాకు ప్రమోషన్ లో భాగంగా కాస్త వెరైటీగా ఉండాలని అజయ్ ఘోష్ తో ఈ రకంగా ఆడియో చేయించి విడుదల చేశారని తెలిసింది.

ఇక ఈ సినిమా మొత్తానికి నవంబర్ 4 దీపావళి రోజున విడుదల చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube