నాగార్జున సాగర్ కు ఉగ్రముప్పు ఉందంటూ ఐబీ హెచ్చరిక,అప్రమత్తమైన ప్రభుత్వం  

Threat For Nagarjuna Sagar-

నాగార్జున సాగర్ కు ఉగ్రముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) హెచ్చరించినట్లు తెలుస్తుంది.తెలుగురాష్ట్రాలకు నీరు అందిస్తున్న నాగార్జున సాగర్ తో పాటు కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్ పై కూడా ఉగ్రవాదుల కన్ను ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణా ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.ఉగ్రవాదుల కన్ను ఈ రెండు ప్రదేశాలపై ఉందని ఈ క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ కేంద్రం ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తుంది..

Threat For Nagarjuna Sagar--Threat For Nagarjuna Sagar-

అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ సహా మరో 20 రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు జరపాలన్న ఉద్దేశ్యం తో ఉన్నట్లు ఐబీ హెచ్చరించినట్లు సమాచారం.మరోవైపు గతంలో కూడా నాగార్జున సాగర్ కు ఇలానే పలుమార్లు హెచ్చరికలు వచ్చాయని, కానీ మరలా ఐబీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తుంది.

కాగా నేపాల్‌లో ఉగ్రదాడి తరువాత సముద్ర మార్గం నుంచి భారత్‌కు కొందరు ఉగ్రవాదులు వచ్చారని.మన దేశంలో దాడులు జరిపేందుకు వీరు సిద్ధమయ్యారని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వీరు గురి పెట్టినట్లు అప్పట్లో ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరోసారి కేంద్రం అప్రమత్తమై ముందస్తు సమాచారాన్ని తెలంగణా ప్రభుత్వానికి లేఖ ద్వారా అందించింది.