ఆ హీరో కారణంగా త్రివిక్రమ్ కి బెదిరింపు కాల్స్.. ఆ తర్వాత జరిగిన సీన్ ఇదే?

సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలకు, నటీనటులకు కొన్ని కొన్ని సమయాలలో బెదిరింపు కాల్స్ వస్తుంటాయి.అవి చాలావరకు సినిమాల విషయంలోనో లేదా తమ అభిమాన నటీనటుల కోసమో ఇలా అభిమానులు బాగా బెదిరింపు కాల్స్ చేస్తుంటారు.

 Threatening Calls To Trivikram Because Of That Hero Is This The Scene That Happe-TeluguStop.com

ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ఇటువంటి బెదిరింపు కాల్స్ బాగా ఎదుర్కొన్నారు.ఇదిలా ఉంటే త్రివిక్రమ్ కు బెదిరింపు కాల్స్ బాగా వచ్చాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.ప్రతి ఒక్క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈయన దర్శకత్వంలో కథలన్నీ ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లతోనే ఎక్కువగా రూపొందుతాయి.ఈయన ఎక్కువగా స్టార్ హీరోలకే ఇంపార్టెంట్ ఇస్తుంటాడు.

ఇదిలా ఉంటే గతంలో ఓ హీరో వల్ల త్రివిక్రమ్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.ఇంతకీ అసలేం జరిగిందంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన దర్శకత్వంలో 2010లో ఖలేజా సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క నటీనటులు గా నటించారు.ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా గురించి అభిమానులకు ముందే తెలిసింది.

Telugu Anushka, Khalaja Movi, Mahesh Babu, Tollywood, Trivikram-Movie

దీంతో ఈ సినిమాను ఎలాగైనా మహేష్ బాబు పుట్టినరోజు వరకు పూర్తి కావాలని లేదంటే తీవ్రమైన పరిమాణాలు ఎదురవుతాయని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బెదిరింపు కాల్స్ బాగా వచ్చాయట.దీంతో మహేష్ బాబు వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మహేష్ అభిమానుల నుండి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈ విషయాన్ని కామెడీగా తీసుకున్నాడని ఈ కాల్స్ లను పక్కన పెట్టేశాడని తెలిసింది.

Telugu Anushka, Khalaja Movi, Mahesh Babu, Tollywood, Trivikram-Movie

ఇదంతా గతం లో జరుగగా మళ్లీ తను సినిమా తీసే హీరో అభిమానుల నుండి ఇలాంటివి ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతో ముందుగానే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.ఇలా చాలా వరకు స్టార్ హీరోల అభిమానులు మాత్రమే చేస్తుంటారు.గతంలో స్టార్ హీరోల సినిమాలు ప్రకటించిన సమయానికి విడుదల చేయక పోయేసరికి కూడా నేరుగా అభిమానులు వాళ్లకి ఫోన్ చేసి మరి బెదిరించే వాళ్ళు.

Telugu Anushka, Khalaja Movi, Mahesh Babu, Tollywood, Trivikram-Movie

ఇప్పటికీ కూడా కొందరు స్టార్ హీరోలు ఇలాంటివి తమ అభిమానుల నుండి ఎదుర్కొంటూనే ఉంటారు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలతో వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.మహేష్ బాబుతో కూడా మరోసారి ఓ సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్.

ఇదివరకే ఖలేజా, అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లోనే రూపొందగా ప్రస్తుతం మూడో సినిమాకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.ఇక త్వరలోనే ఈ సినిమా గురించి కొన్ని అప్ డేట్ లు ప్రకటించనున్నారు.

ఇక వీరి కాంబినేషన్ లో మూడో సారి రూపొందుతున్న ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube