తిరుపతి లడ్డూలో అవి చూసి నోరెళ్లబెట్టిన భక్తులు

కలియుగ వైకుంఠం తిరుపతికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.అంతే ప్రాధాన్యత కలిగి ఉన్న తిరుపతి లడ్డు కోసం భక్తులు పోటీ పడుతుంటారు.

 Thread And Hair Found In Tirupati Laddu-TeluguStop.com

అయితే నిర్వాహకుల పుణ్యమా అని తిరుపతి లడ్డూ నాణ్యత విషయంలో అనేక సార్లు డొల్లతనం బయటపడింది.కాగా తాజాగా మరోసారి తిరుపతి లడ్డూ నాణ్యత లోపించడంతో భక్తులు నోరెళ్లబెట్టిన ఘటన వెలుగు చూసింది.

హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు ఇటీవల తిరుమల వెళ్లివచ్చారు.వారు ప్రసాదంగా తెచ్చుకున్న తిరుపతి లడ్డూలను తెరచి చూడగా.లడ్డూలో దారం, వెంట్రుకలు కనిపించాయి.దీంతో అవాక్కవ్వడం వారి వంతయ్యింది.

 Thread And Hair Found In Tirupati Laddu-తిరుపతి లడ్డూలో అవి చూసి నోరెళ్లబెట్టిన భక్తులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పరమపవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో ఇలాంటి డొల్లతనం అడపాదడపా బయటపడుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.తితిదే అధికారులు సరైన రీతిలో నాణ్యతను పరిశీలించినట్లయితే ఇలాంటి అవకతవకలు జరగవని వారు ఆశిస్తున్నారు.

కాగా తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు నాణ్యమైన లడ్డూలను అందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.ఏదేమైనా తిరుపతి లడ్డూలో దారం, వెంట్రుకలు దర్శనిమియ్యడంతో సదరు భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు.

ఈ ఘటనపై తితిదే బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు భక్తులు.

#Malkajgiri #Thread #Tirupati Laddu #Tirupati #Hair

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు