అనుమానంతో మహిళలను దారుణంగా.. ?- Thrashed Women Over Child Kidnapping

thrashed women over child kidnapping, kamareddy, womens, child kidnapping, rumours - Telugu Child Kidnapping, Kamareddy, Rumours, Womens

ప్రస్తుతం సమాజంలో ఏ విషయం పట్ల అయినా ఒక పుకారు అత్యంత వేగవంతంగా ప్రజల్లోకి వెళ్లుతుంది.అది నిజమా, కాదా అని నిర్ధారించుకోకుండానే దాన్ని సోషల్ మీడియాలో పదిమందికి పంచడం అలవాటు అయ్యింది.

 Thrashed Women Over Child Kidnapping-TeluguStop.com

ఇలాంటి సంఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.ఇకపోతే గత రెండు రోజుల కిందట దొంగబాబాల రూపంలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తిరుగుతోందంటూ కొందరిని గ్రామస్తులు చితకబాదిన సంగతి తెలిసిందే.

Telugu Child Kidnapping, Kamareddy, Rumours, Womens-Latest News - Telugu

ఆ ఘటన మరువక ముందే కామారెడ్డి జిల్లాలో మహిళలను చితకబాదిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ముగ్గురు మహిళలు అనుమానస్పదంగా తిరుగుతూ ఉండటంతో, అక్కడి గ్రామస్తులు వారిని, ఎవరని నిలదీయగా, మహిళలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లు కావచ్చూ అనే అనుమానంతో తీవ్రంగా కొట్టారట.

 Thrashed Women Over Child Kidnapping-అనుమానంతో మహిళలను దారుణంగా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొట్టొద్దని చేతులెత్తి దండం పెట్టినా వదలకుండా ఇరగదీసారట.ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా వారు వనపర్తి జిల్లాకు చెందిన వారని తెలిసిందట.

ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సమాచారం.

#Rumours #Womens #Kamareddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు