Tech Layoffs : భారతీయ టెకీ ల గగ్గోలు...ఎన్నారైల పరిస్థితి ఎలా ఉందంటే...!!!

అమెరికాలో ఆర్ధిక మాంద్యం దెబ్బ అక్కడ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.ఇప్పటికే బడా సంస్థలు ఎన్నో ఉద్యోగాలలో కోతలు విధించాయి.

 Thousands Of Techies Lose Jobs In Us,us,indians,it Employees,layoff,tech Layoffs-TeluguStop.com

ముఖ్యంగా హెచ్-1బి వీసా పై వచ్చిన వృత్తి నిపుణులకు ఈ పరిణామం షాక్ కి గురిచేస్తోంది.ఎన్నో ఏళ్ళ నుంచీ అమెరికాలోనే ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిపై కూడా ఈ ప్రభావం చూపుతోంది.

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా భారతీయ టెకీలు ఉండటం గమనార్హం.కాగా వీరందరూ కేవలం 60 రోజుల గ్రేస్ పిరియడ్ లోనే మరొక కొత్త ఉద్యోగాలలో చేరాలి లేకపోతే వారు అమెరికా విడిచి వేల్లిపోవాల్సిందే…ఈ పరిస్థితుల నేపధ్యంలో మన ఎన్నారైల పరిస్తిస్థితి అగమ్యగోచరంగా మారింది…

హెచ్-1 బి వీసా పై ఎంతో మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు.

వీరందరూ గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తుందా అంటూ ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్నారు.వీరిలో కొంతమంది ఇంటి లోన్స్, తీసుకోవడం, మరి కొందరు పలు రకాల లోన్స్ తీసుకుని వాటికి వచ్చే జీతంతో ఈఏంఐ లు కట్టుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో ఉద్యోగం కోల్పోవడం వారికి కోలుకోలేని దెబ్బ తీసినట్లు అయ్యింది.ఉద్యోగం కోల్పోన స్థితిలో వీటి లోన్స్ ను ఏ విధంగా కట్టాలి అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Tech Layoffs, Hb Visa, Indian Startups, Indians, Employees, Layoff, Thous

మరో వైపు కొత్త ఉద్యోగం సంపాదించాక పొతే అమెరికా విడిచి వెళ్లిపోవాలి, కానీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉండటంతో కొత్త ఉద్యోగాలకు పోటీ పెరిగిపోతుంది పైగా ఇప్పుడు లభించే జీతం కంటే చాలా తక్కువ జీతంతో స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.ఒక వేళ అలాంటి చిన్న కంపెనీలలో ఉద్యోగం వచ్చినా చేసిన అప్పులకు ఈ ఏంఐ లు ఎలా కట్టాలోనని ఆందోళన చెందుతున్నారు.అమెరికాలో దాదాపు 15 ఏళ్ళుగా ఉంటున్న వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొత్తగా ఉద్యోగాలు సాధించి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళిన వారి కలలు మధ్యలోనే చిద్రం అయ్యినట్టేనని అంటున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube