యాచ‌కుడి అంతిమ యాత్ర‌కు వేలాదిగా వ‌చ్చిన జ‌నం.. ఎందుకో తెలిస్తే

మానవ జీవితంలో ఎవ‌రి కాలం ఎప్పుడు ముగుస్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు.ఏ క్ష‌ణం మ‌ర‌ణిస్తామో చెప్ప‌డం అంత ఈజీ కాదు.

 Thousands Of People Came For The Beggar's Final Journey  F You Know Why, Beggar-TeluguStop.com

అయితే బ‌తికున్నంత కాలం మ‌నం చేసిన మంచి ప‌నులే మ‌న‌ల్ని చ‌నిపోయిన త‌ర్వాత న‌లుగురికి ద‌గ్గ‌ర చేస్తాయి.ఆ న‌లుగురే మ‌న అంతిమ యాత్ర‌లో క‌లిసి న‌డుస్తారు.

అయితే ఇప్పుడు ఓ యాచ‌కుడి విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగింది.ఆయ‌న అంతిమ యాత్ర‌కు ఏకంగా వేలాది మంది త‌ర‌లి రావ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

అదేంటి యాచ‌కుడి అంతిమ యాత్ర‌కు అంత‌మంది త‌ర‌లి రావ‌డం అనుకుంటున్నారు క‌దా.

మ‌రి అంత‌మంది ఎందుకు వ‌చ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ర్ణాట‌క‌లోని విజయ్‎నగర్ జిల్లాకు చెందిన‌టువంటి హడగలి సిటీలో బ‌స్యా అనే యాచ‌కుడు నివ‌సిస్తున్నాడు.అత‌ను ప్ర‌తి ఒక్క‌రికీ అక్క‌డ ప‌రిచ‌య‌మే.

అత‌ను అంద‌రి ద‌గ్గ‌ర కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే యాచిస్తుంటాడు.అంత‌కంటే ఎక్కువ ఎవ‌రైనా ఇస్తే వ‌ద్ద‌ని తిరిగి ఇచ్చేస్తాడంట‌.

దీంతో అంద‌రికీ సుప‌రిచితుడుగా మారిపోయాడు.అంతే కాదు అత‌నికి భిక్ష వేస్తే పుణ్యం వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తుంటారు.ఇలా అంద‌రి మ‌ధ్య అత‌ను మెదులుతున్నాడు.

కాగా నవంబర్ 12న అత‌నికి బ‌స్సు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.ఇది తెలుసుకున్న హ‌డ‌గ‌లి ప్రాంత వాసులు పెద్ద ఎత్తున అత‌ని అంతిమ‌యాత్ర‌కు త‌ర‌లి వ‌చ్చారు.మామూలు మ‌నుషుల‌కు కూడా ఇంత మంది త‌ర‌లిరార‌ని, అత‌ని ద‌హ‌న సంస్కారాల‌కు ఇంత‌మంది రావ‌డంతో ఆ వీడియోలు నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి.

ఇక దీన్నిచూసిన వారంతా అత‌ని మంచి మ‌న‌సును అభినందిస్తున్నారు.బ‌తికున్న‌ప్పుడు మ‌నం చేసే ప‌నులే ఇలా చ‌నిపోయాక జ‌నాన్ని మ‌న వెంట న‌డిచేలా చేస్తాయని కామెంట్లు పెడుతున్నారు.

ప్ర‌స్తుతం ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube