కెనడాలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ , ఇండియా డే ఫెస్టివల్.. తరలివచ్చిన భారతీయులు

కరోనా పరిమితుల కారణంగా గత రెండేళ్లుగా కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వర్చువల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈసారి పరిస్ధితులు చక్కబడిన నేపథ్యంలో ఆదివారం టొరంటోలో ఇండియా డే ఫెస్టివల్, గ్రాండ్ పరేడ్ ఘనంగా జరిగింది.

 Thousands Attend India Day Festival, Grand Parade In Toronto In Canada , Grand P-TeluguStop.com

ఈ కార్యక్రమానికి దాదాపు పది వేల మంది భారత సంతతి ప్రజలు హాజరయ్యారు.ఇక్కడే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను కూడా నిర్వహించారు.

పరేడ్‌లో భారత్‌లోని 25 రాష్ట్రాలకు చెందిన వారు , 15కి పైగా కవాతు బృందాలు డౌన్‌టౌన్ టొరంటోలోని నాథన్ ఫిలిప్స్ స్వ్కేర్‌లో దాదాపు 12 గంటల పాటు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ ఫుడ్ స్టాల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వేడుకల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 553 మీటర్ల ఎత్తైన సీఎన్ టవర్‌ను భారత త్రివర్ణ పతాకపు రంగులతో దేదీప్యమానంగా వెలిగించారు.పనోరామా ఇండియా చైర్ వైదేహి భగత్ మాట్లాడుతూ.

ఆదివారం రోజంతా దాదాపు లక్షమంది ఇండో కెనడియన్లు ఈ వేడుకలకు హాజరై వుంటారని అంచనా వేశారు.ఇది నిజంగా అద్భుతమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెనడా రక్షణ మంత్రి , భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ హాజరయ్యారు.ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించి కలిసి వచ్చిన ఇండో కెనడియన్లకు ఆమె ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఎలాంటి అంతరాయం కలగకుండా టొరంటో పోలీసులు భారీగా మోహరించారు.

Telugu Anita Anand, Azadika, Canada, Grandparade, Indiaday, Panoramaindia, Thous

కెనడాలో ఇండియా డే పరేడ్‌ను ప్రతియేటా ఆగస్ట్ 15 ముగిసిన తర్వాత వచ్చే ఆదివారం నిర్వహిస్తారు.ఇకపోతే.ఆగస్ట్ 15న ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు.22 కమ్యూనిటీ సంస్థలు కలిసి ఈవెంట్‌ను నిర్వహించాయి.గురుకుల్ ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటీష్ కొలంబియాలో తిరంగా యాత్ర కార్ ర్యాలీ నిర్వహించింది.

ఇందులో దాదాపు 300 వాహనాలు పాల్గొన్నాయి.కెనడా ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించిన మరో కార్యక్రమం ఈ ఆదివారం మాంట్రియల్‌లో జరిగింది.

కాగా… జూలై 31 , ఆగస్ట్ 1 తేదీలలో జరిగిన టేస్ట్ ఆఫ్ ఇండియా ఫుడ్ ఫెస్టివల్‌కు దాదాపు 1,75,000 మంది సందర్శకులు హాజరయ్యారు.దీనిని ఇండో కెనడియన్ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ నిర్వహించింది.

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube