నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వెయ్యి మంది రైతులు  

పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీ సీటుకి పోటీ చేయనున్న వెయ్యి మంది రైతులు. .

Thousand Farmers Ready To Contest On Nizamabad Mp Seat-

గత కొంత కాలంగా తెలంగాణలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు రైతులు తమ పంటలకి గిట్టుబాటు ధర ప్రకటించాలని ఆందోళన చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రభుత్వం నుంచి మాత్రం రైతుల ఆందోళనపై ఎలాంటి స్పందన లేదు.అసలు రైతుల సమస్యలే లనట్లు టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం మానేసింది..

Thousand Farmers Ready To Contest On Nizamabad Mp Seat--Thousand Farmers Ready To Contest On Nizamabad MP Seat-

దీంతో నిజామాబాద్ జిల్లా రైతులు తమ ఆందోళనని వినూత్న రీతిలో తెలియజేయడానికి సిద్ధం అయ్యారు.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఒకే సారిగా వెయ్యి మంది రైతులు మిగిలిన పార్టీల అభ్యర్ధులపై పోటీగా దిగాలని ఆలోచన చేస్తున్నారు.ఇలా చేయడం ద్వారా తమ సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్తాయని, ఎన్నికల సంఘం కూడా తమ సమస్యలపై రియాక్ట్ అవుతుందని భావించి నిజామాబాద్ జిల్లా రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రైతులు ఇలా ఎన్నికలలో పోటీ చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది.మరి దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.