పనికిరాని బొమ్మలు అనుకున్నారు.. కానీ వేలం వేస్తే ఏకంగా..?!

చిన్న పిల్లలకు బొమ్మలు కొనడం అంటే ఎంతో ఇష్టం.వాటిని కొనేంతవరకు పిల్లలు మారాం చేస్తూ ఉండడం కూడా సర్వసాధారణం.

 Star Wars Toys, Couple, Britain, Death, Toys, House, Auction, Three Crores-TeluguStop.com

అయితే ఇలా బొమ్మలు కొనడం కేవలం పిల్లలకు మాత్రమే కాదు కొంతమంది పెద్ద వారు కూడా కొన్ని రకాల బొమ్మలు కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు.అందులో కొన్ని బొమ్మలను మనం వద్దనుకొని వాటిని వాడకుండా ఓ పక్కన మూలకు పడేస్తాం.

లేకపోతే ఎవరికైనా ఇష్టం ఉంటే వారికి గిఫ్ట్ గా ఇచ్చేస్తూ ఉంటాయి.ఒకవేళ ఉపయోగించిన తర్వాత అవి విరిగిపోతే వాటిని చెత్తకుప్పలో పడేస్తూ ఉంటాము.

ఇక అసలు విషయంలోకి వెళితే.

బ్రిటన్ లోని స్టవుర్ బ్రిడ్జ్‌కు చెందిన ఓ జంటకి ఊహించని విధంగా వారికి అదృష్టం కలిసి వచ్చింది.

తమ ఇంటి పక్కన ఉన్న ఓ వ్యక్తి దశాబ్దాలుగా కలెక్ట్ చేసిన కొన్ని స్టార్ వార్స్ బొమ్మలు వారికి లభించాయి.అది ఎలా అంటే ఆ వ్యక్తి చనిపోవడానికి ముందు కొన్ని బొమ్మలను వారితో తీసుకవెళ్ళమని చెప్పడంతో ఆ జంట బొమ్మలు తీసుకువచ్చి తమ ఇంట్లో ఓ మూలన పడేస్తారు.

అయితే వాటిని ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు అలాగే ఉంచారు.అయితే వారి స్నేహితుల్లో కొందరికి ఈ బొమ్మల గురించి తెలిసిన స్నేహితులు ఉండటంతో వారికి ఆ బొమ్మలు చూపించడంతో అవి చాలా పురాతనమైన కలెక్షన్ అని వాటికి వేలం వేస్తే పెద్ద ఎత్తున సంపాదించవచ్చని సలహా ఇచ్చారు.

దీంతో వారి స్నేహితులు చెప్పినట్టుగానే ఆ జంట ఆస్టోన్స్ ఆక్షనీర్స్‌ను వద్దకు వెళ్లారు.

అలా వారి దగ్గరికి వెళ్లిన సమయంలో ఆ బొమ్మల్ని కూడా తీసుకువెళ్లగా వాటిని ప్రముఖ పరిశీలనా స్పెషలిస్ట్ ఆయన ఆస్టన్ అవి చూసి ఆశ్చర్యపోయాడు.

నిజానికి ఆ బొమ్మలలో చాలా బొమ్మలు ఇంకా ప్యాకింగ్ లోనే ఉన్నాయని అవి చాలా అరుదుగా లభించే బొమ్మలని తెలిపాడు.ప్రస్తుతం ఇలాంటి బొమ్మలు మార్కెట్లో కూడా లేవని ఆయన చెప్పుకొచ్చాడు.

వీటిలో 1978 నుంచి 2015 వరకు వివిధ రకాలుగా వచ్చిన స్టార్ వార్స్ కు సంబంధించిన బొమ్మలు ఉండడంతో వాటిని ఆస్టన్ వేలానికి ఉంచారు.అయితే వారు ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వాటిని కొనుగోలు చేయడానికి సుముఖత చూపించారు.

ఇలా వారి దగ్గర ఉన్న మొత్తం బొమ్మలను అమ్మే సరికి ఏకంగా వారికి మూడు కోట్ల రూపాయలు లభించాయి.దీంతో ఆ జంటకు ఎనలేని ఆనందం కలిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube