సానుభూతి వస్తున్నా... సానుకూలత లేదేమి ? 

అసలు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతుంది అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయి.2019 ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపి ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ విధంగా ఉన్నాయి.అధికార పార్టీ వైసిపి దూకుడుగా ఉండడం , 151 సీట్లతో అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో,  జగన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా,  తన పరిపాలన ను కొనసాగించుకుంటూ వెళ్తున్నారు.ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

 Though The Telug -desam Party Is Getting Sympathy From The People The Party Is N-TeluguStop.com

ఇదే సమయంలో గత టిడిపి ప్రభుత్వంలో తమను ఎలా అయితే వెంటాడి వేధించే వారో అదేవిధంగా కేసులతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించడం, టిడిపి నేతలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పైన జగన్ దృష్టి పెట్టడం, అలాగే పాత కేసులను బయటకు తీసి ఎంతోమంది టీడీపీ నేతలను అరెస్టు చేయించడం, ఇంకా ఆ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాాయి.  అయితే ఈ అరెస్టుల ప్రక్రియ కొనసాగుతూ ఉండడం పై మొదట్లో టిడిపి నేతల్లో ఆందోళన కనిపించినా టిడిపి అగ్రనేతలు మాత్రం ఈ పరిణామాలన్నీ తమకు కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.

గతంలో తాము వైసీపీ నేతల పై నమోదు చేసిన కేసులు, వేధింపుల కారణంగా ఆ పార్టీపై ప్రజల్లోో సానుభూతి  వచ్చిందని చంద్రబాబు నమ్ముతున్నారు.ఇప్పుడు చూస్తే మాజీ మంత్రులు  కొల్లు రవీంద్ర , సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వం లో అరెస్టు అయ్యారు.ఇంకా అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరికొంతమంది అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.  ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి.వైసిపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది అనే విషయం జనాల్లోకి వెళ్లింది.

ఆ రకంగానూ టిడిపి పై సానుభూతి పెరిగింది.అయితే ఈ విధంగా వచ్చిన సానుభూతి టీడీపీకి కలిసి వస్తుందా అంటే అలా కూడా పరిస్థితులు కనిపించడం లేదు.

దీనికి కారణం సరైన రీతిలో ఆ సానుభూతిని ఉపయోగించుకోలేక పోవడమే కారణంగా కనిపిస్తోంది. ప్రజలకు మేలు జరిగే అంశాలలోనూ, టిడిపి అనవసరంగా రాద్ధాంతం చేయడం,  చిన్న విషయాలపై చంద్రబాబు వంటి వారు స్పందిస్తూ తన స్థాయిని తగ్గించు కోవడం వంటి వ్యవహారాలు ఎన్నో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

Telugu Ap, Chandrababu, Jagan, Kollu Ravindra, Ysrcp-Telugu Political News

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టిడిపి కేడర్ నుు ముందుండి  నడిపించే నాయకులు పెద్దగా కనిపించకపోవడంం , ఇటీవల పెద్ద ఎత్తున

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube