మందుబాబులకు కొత్త రూల్.. వింటే హడలిపోతారు.. !

మందుబాబులకు మరొక షాకింగ్ న్యూస్.మద్యం తాగి వాహనాలు నడిపే వారితో పాటుగా వెంట ఉన్నవారు కూడా హడలిపోయే విధంగా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవడాని సన్నహాలు చేస్తున్నారు.

 Telangana, Trafic Police, Drunk And Drive, Jail-TeluguStop.com

ఈ క్రమంలో ఇప్పటి వరకు మద్యం తాగి వాహనాలను నడిపే వారిపైనే కేసు నమోదు చేస్తున్న పోలీసులు, ఇకపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఇంతకు విషయం ఏంటంటే.మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని నడిపే వారు మద్యం తాగి ఉన్నారంటే అతనితో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

మోటార్ వాహనాల చట్టం 1988, సెక్షన్ 188 ప్రకారం ఈ నిబంధనలు విధిస్తున్నట్లుగా తెలుపుతున్నారు.ఈ నియమం ద్విచక్ర వాహనాలతో పాటుగా 4వీలర్స్ నడిపే వారికి కూడా వర్తిస్తుంది.

కాబట్టి ద్విచక్ర వాహనమైనా, ఫోర్ వీలర్ అయినా, డ్రైవర్ మద్యం తాగి ఉంటే అతనితో పాటు ప్రయాణిస్తూ తనిఖీల్లో దొరికితే మాత్రం మీ పని అయిపోయినట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube