సీనియర్ హీరోల్లో ఆ ఇద్దరే టాప్...

సీనియర్ హీరోలు అయిన చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల్లో ఒకప్పుడు మంచి పోటీ ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య పోటీ అనేది చాలా వరకు తగ్గిపోయింది.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ల పరిది మేరకు సినిమాలు చేస్తూ చాలా ట్రై చేస్తున్నారు…అయిన కూడా వాళ్ల సామర్థ్యం మేరకు హిట్టు ప్లాప్ తో సంబందం లేకుండా చాలా మంచి సినిమాలు చేస్తున్నారు.

 Those Two Are Top Among Senior Heroes, Senior Heros , Balakrishna, Chirenjeevi,-TeluguStop.com

అయితే గత 20 సంవత్సరాల లో చిరంజీవి ని మినహా ఇస్తే మిగిలిన ముగ్గురు హీరోలు కూడా హిట్స్ కంటే ప్లాప్ సినిమాలనే ఎక్కువ గా ఇచ్చారు.

మొదట బాలయ్య( Balayya ) గురించి చూసుకుంటే బాలయ్య చేసిన 75 % సినిమాలు ప్లాప్ లుగా మిగిలాయి.

 Those Two Are Top Among Senior Heroes, Senior Heros , Balakrishna, Chirenjeevi,-TeluguStop.com

నిజానికి బాలయ్య సినిమా కెరియర్ ఎప్పుడోముగిసిపోవాల్సింది.కానీ బోయపాటి తీసిన సింహ, లెజండ్, అఖండ( Simha, Legend, Akhanda ) వంటి సినిమాల వల్ల ఆయన ఇంకా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాల్లో బాలయ్య చేసిన సినిమాల్లో కేవలం బోయపాటి తో చేసిన ఈ మూడు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక ఈయన తర్వాత ఉన్న మరో హీరో నాగార్జున… నాగార్జున దాదాపు ఈ 15 సంవత్సరాలలో మనం, సోగ్గాడే చిన్నినాయన లాంటి సినిమాలు మినహా ఇస్తే ఇంకా వేరే ఏ సినిమాలు కూడా పెద్ద గా సక్సెస్ కాలేక పోయాయి… కారణం ఏంటి అంటే ఆయన చేసిన సినిమాల్లో కథ కరెక్ట్ గా లేకపోవడమే దానికి కారణం.

Telugu Balakrishna, Chirenjeevi, Nagarjuna, Senior Heros, Tollywood, Venkatesh-M

ఇక ఇంకో హీరో అయిన వెంకటేష్ గురించి చూసుకుంటే ఆయన హీరో గా చేసిన చాలా సినిమాలు మినిమం గ్యారెంటీ గా అడుతాయి కాబట్టి వెంకటేష్ సినిమాలు ప్లాప్ అయినా కూడా మని రికవరీ అవుతుంది…అయిన కూడా ఈయన ఇప్పుడు ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలే చేస్తున్నాడు… వెంకటేష్, మహేష్ బాబు, రామ్ పోతినేని, విశ్వక్ సేన్ లాంటి హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేసాడు.

Telugu Balakrishna, Chirenjeevi, Nagarjuna, Senior Heros, Tollywood, Venkatesh-M

ఇక చిరంజీవి( Chiranjeevi ) ఒక 10 సంవత్సరాలు ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకున్న కూడా ప్రస్తుతానికి ఆయనే నెంబర్ వన్ హీరో గా ఉన్నాడు… ఈయన కం బ్యాక్ ఇచ్చిన తర్వాత చేసిన ఆరు సినిమాల్లో మూడు సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చెయ్యడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి… ఇక ఈ నలుగురి లో చిరంజీవి, బాలయ్యలు మాత్రమే ప్రస్తుతం ఇండస్ట్రీ లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలు చేస్తున్నారు…వెంకటేష్, నాగార్జున ఇద్దరు కూడా రేస్ లో చాలా వరకు వెనకబడి పోయారనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube