కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్న ఆ ముగ్గురు..!

తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా అస‌లు కేసీఆర్‌కు ఎదురు నిలిచే వ్య‌క్తే లేకుండా పోయారు.ఏ పార్టీ అయినా స‌రే కేసీఆర్ సెట్ చేసిన ట్రెండ్ లోనే న‌డిచేది.

 Those Three Who Are Putting Tension On Kcr ..!, Kcr, Revanth, Ts Poltics , Sharm-TeluguStop.com

అంతలా ఆయ‌న అన్ని పార్టీల‌ను త‌న గ్రిప్‌లో పెట్టుకున్నారు.కాగా ఇప్ప‌డు ఇన్నాళ్ల‌కు ఆయ‌న‌కు కొంత టెన్ష‌న్ ప‌ట్టుకుంది.

ఎందుకంటే గ‌తంలో అన్ని పార్టీల‌ను నిర్వీర్యం చేసి అందులోని నాయ‌కుల‌ను లాగేసుకున్న కేసీఆర్ క్ర‌మంగా ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌ప‌డ‌టంతో కొంత క‌ల‌వ‌ర ప‌డుతున్నారు.అయితే వాటిల్లోని నాయ‌కుల‌ను మాత్రం లాగేసుకోవ‌డం కేసీఆర్‌కు పెద్ద క‌ష్టంగా మారడంతో ఆయ‌న కొంత ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కావ‌డంతో కొంత ఒత్తిడి పెరిగింది.అలాగే వైఎస్ ఆర్ బిడ్డ‌గా షర్మిల కొత్త పార్టీ పెట్టడంతో ఓట్లు అటువైపు కూడా వెళ్లే ప్ర‌మాదం ఉంది.

ఇక బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ వ‌చ్చి ఎంత‌గా దూసుకుపోతున్నారో చూస్తూనే ఉన్నాం.ఈ ముగ్గురు కూడా పెద్ద శ‌క్తిగా ఎదుగుతున్నారు.ఈ ముగ్గురు కూడాచాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించే నేత‌లే కావ‌డంతో ప్ర‌స్తుతం తెలంగాణ రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయ‌నే చెప్పాలి.ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ చాలా చాక‌చ‌క్యంగా తెలంగాణ సెంటిమెంట్తో అన్ని పార్టీల‌ను ఓడించారు.

Telugu Bandi Sanjay, Etala Rajender, Revanth, Revanth Reddy, Sharmila, Ts Con Gr

కానీ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిప‌క్ష పార్టీలన్నీ క‌లిసి వ‌రుస ఆందోళ‌న‌ల‌కు పిలుపునిస్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతూ యూత్‌ను త‌మ వెంట తిప్పుకుంటున్నాయి.ఇక రేవంత్‌, ష‌ర్మ‌ల‌, బండి సంజ‌య్ లాంటి ప్రశ్నించే దమ్మున్న నాయకులు ప్రతిపక్షాల‌కు అధ్య‌క్షులుగా ఉండ‌టంతో యూత్ మొత్తం వారి వెంటే న‌డుస్తోంది.దీంతో టీఆర్ ఎస్‌లోయూత్ విభాగాలు చాలా బ‌ల‌హీన ప‌డుతున్నాయి.

దీంతో కేసీఆర్ ఈ ముగ్గురిని ఒకేసారి ఎదుర్కోవ‌డానికి త్రిముఖ వ్యూహాన్ని ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube