ఏపీ స్టేట్ కొత్త ఎలక్షన్ కమిషనర్ రేసులో ఆ ముగ్గురు..!!

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ గా వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొత్త ఎలక్షన్ కమిషనర్ గా ముగ్గురు పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.

 Those Three In The Ap State New Election Commissioner Race  Andhra Pradesh, Neel-TeluguStop.com

మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రేమ్ చంద్ రెడ్డి, సామ్యూల్ పేర్లను సిఫార్సు చేసింది.ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్రానికి కొత్త ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పాలని పేర్కొంది.

దీంతో ఈ ముగ్గురిలో ఎవరికి ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ అవకాశం ఇస్తారో అన్నది సస్పెన్స్ గా మారింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2016వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.

ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ తీసుకున్న చాలా నిర్ణయాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ని ఇరకాటంలో పెట్టడం జరిగాయి.ఇలాంటి తరుణంలో నిమ్మగడ్డ ప్లేసులో ఇప్పుడు ఎవరు వస్తారు అన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube