ఐఫోన్ల కోసం భారీగా పెట్టుబడి పెట్టిన ఆ మూడు కంపెనీలు..!  

Three Companies Investing Crores on Iphones,three companies, invested, heavily, iPhones - Telugu Heavily, Invested, Iphones, Three Companies, Three Companies Investing Crores On Iphones

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్లను విక్రయించేందుకు మూడు గ్లోబల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి.ఇండియన్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి.

TeluguStop.com - Companies Invest Iphones

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీం ద్వారా దాదాపు 900 మిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నారు.వచ్చే అయిదేళ్లలో యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెంచే దిశగా కంపెనీ కసరత్తు చేస్తోంది.

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీంలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఇండియా స్మార్ట్ ఫోన్ల ఎగుమతి ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు.దీంతో ఐఫోన్ల కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.

TeluguStop.com - ఐఫోన్ల కోసం భారీగా పెట్టుబడి పెట్టిన ఆ మూడు కంపెనీలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

యాపిల్ అనుబంధ సంస్థగా ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు.వచ్చే ఐదేళ్లలో సుమారు 900 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతున్నారు.

ఫాక్స్ కామ్, విస్ట్రాన్, పెగట్రాన్ వంటి అనుబంధ సంస్థలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీంలో పెట్టుబడులు పెట్టనున్నాయి.భారత్ లో ఉత్వత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఫాక్స్ కామ్ సంస్థ సుమారు 4000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ స్కీంకు దరఖాస్తు చేసుకుంది.పెగట్రాన్, విస్ట్రాన్ కంపెనీలు సైతం రూ.1,200 కోట్లు, రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.అయితే ఇంత భారీ మొత్తం పెట్టుబడులు రూ.6,500 కోట్లు కేవలం యాపిల్ స్మార్ట్ ఫోన్ల తయారీకే వాడుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.అయితే భారత మార్కెటింగ్ రంగంలో ఐఫోన్ ఉత్పత్తులను పెంచే దిశగా భారీ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.

#IPhones #Heavily #Invested #ThreeCompanies #Three Companies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Companies Invest Iphones Related Telugu News,Photos/Pics,Images..