ఆ చెంపదెబ్బలు చాలా కాస్ట్లీ గురూ..!

ప్రపంచంలో మనకు చాలా తెలియని గేమ్స్ ఎన్నో ఉన్నాయి.అందులో మనకు సుపరిచితమైన అంశమే కాని, దానిని ఒక ఆటలా ఆడతారు అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు.

 Slapping, Russian, Heavy Body, Fitness, Two Members Opposite, Game, Slapping Gam-TeluguStop.com

అదే చెంప దెబ్బల గేమ్.ఈ గేమ్ రష్యా దేశంలో బాగా ప్రాచుర్యం చెందింది.

కాకపోతే ఈ ఆట కాస్త ప్రమాదకరమైనది కాబట్టి దీన్ని కొద్దిమంది మాత్రమే ఇష్టపడతారు.అందుకే కాబోలు ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్దగా ఫేమస్ కాలేదు.

ఇకపోతే ఈ గేమ్ లో ఎవరిని పడితే వారిని ఆడించే అవకాశమే లేదు.ఈ ఆటలో పాల్గొనాలంటే ఖచ్చితంగా బాగా శరీరం కలిగినవాళ్ళు, బలంగా ఉండే వారు మాత్రమే పాల్గొంటారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ ఆట ఆడే సమయంలో పోటీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ఎదురు ఎదురుగా నిల్చోవాలి.

ఆ ఇద్దరు ప్రతినిధులు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఎదుటివారి చెంపలను వాచిపోయేలా కొట్టుకోవాలి.ఇకపోతే ఈ ఆటలో రూల్స్ విషయానికి వస్తే చెంప దెబ్బ కొట్టే సమయానికి తన ప్రత్యర్థిని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి చెంపను చేయితో చెల్లుమనేలా కొట్టాలి.

ప్రత్యర్థి కళ్ళల్లో చూస్తున్నాము అంటే వారు కొట్టడానికి రెడీగా ఉన్నట్లు అర్థం.ఆ సమయంలో ప్రత్యర్థి తన చెంపను రెడీగా ఉంచుకోవాలి తప్ప అటు ఇటు తిప్పడానికి ప్రయత్నించకూడదు.

ఒకవేళ దెబ్బ నుంచి తప్పించుకోవటానికి పక్కకు జరిగితే ఆ ప్రత్యర్థి ఓడిపోయినట్టే లెక్క.ఇక ఈ గేమ్ ఎలా ఆడతారు అంటే.

ఈ ఆటకు ఎలాంటి సమయం లిమిట్ ఉండదు.ఈ గేమ్ లో ఒకరి తర్వాత ఒకరు ఎదుటి ప్రత్యర్థుల చెంప ఛెళ్లుమనిపించేలా కొట్టుకుంటూ ఉంటారు.

ఇలా కొట్టుకుంటున్న సమయంలో వామ్మో ఇంక నావల్ల కాదు అని పక్కకు తప్పుకుంటే తప్ప ఆట ముగిసినట్లు కాదు.ఎవరైతే అలా ముందుగా పక్కకు తప్పుకుంటారో వారు ఓడిపోయినట్టు మిగితా వారు గెలిచినట్టు.

అంతేకాదు ఈ ఆట జరిగే సమయానికి అక్కడ ఓ రెఫరీ కూడా ఉంటారు.అతడే ఆ ప్రతినిధులు ఇద్దరు ఎప్పుడు కట్టుకోవాలో, ఎప్పుడు ఆపాలో డిసైడ్ చేస్తూ ఉంటాడు.

ఆటలో ఎటువంటి పాయింట్లు ఉండవు.కేవలం ఒకరి తర్వాత ఒకరు చెంపలు వాయించి కొంటూనే ఉంటారు చివరికి ఎవరైతే ఆట నుంచి మొదట తప్పుకుంటారో వారు ఓడిపోయినట్టు, మిగతా వారు గెలిచినట్టు.

ఇక రష్యా దేశంలో ఈ ఆటను బర్రికో గేమ్ అని పిలుస్తారు.ఇక మొత్తం ఆటగాళ్లలో గెలిచిన వ్యక్తికి ఏకంగా 30 వేల రూపాయలకు పైగా బహుమతిగా లభిస్తుంది.

ఇంతలా బహుమతి ఎందుకంటే అంత మందితో మరి చెంప దెబ్బలు కొట్టించుకుంటాడు కదా కాబోలు.అందుకే ఈ చెంప దెబ్బలు చాలా కాస్ట్లీ గురూ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube