జ్యూసులు చేసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ట‌..తెలుసా?

ఆరోగ్యంగా ఉండాల‌న్నా, అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉండాల‌న్నా డైట్‌లో తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే.అయితే పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను మ‌రియు ఆకు కూర‌ల‌ను కొంద‌రు జ్యూసుల రూపంలో తీసుకుంటూ ఉంటారు.

 Those Mistakes Should Not Be Made While Making Juices At Home-TeluguStop.com

అలా తీసుకోవ‌డం కూడా ఆరోగ్యానికి మంచిదే.కానీ, ఇంట్లో జ్యూసులు త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని కొన్ని త‌ప్పుల‌ను అస్స‌లు చేయ‌రాదు.

త‌ప్పులు ఏంటీ.? అవి ఎందుకు చేయ‌కూడ‌దు.? అన్న విష‌యాలు ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసు కుందాం.,/br>

 Those Mistakes Should Not Be Made While Making Juices At Home-జ్యూసులు చేసేట‌ప్పుడు ఈ త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ట‌..తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధాణంగా కూర‌గాయ‌లు మ‌రియు ఆకు కూర‌ల‌తో జ్యూస్ త‌యారు చేసే స‌మ‌యంలో.

రుచిని పెంచుకునేందుకు ఉప్పును యాడ్ చేస్తుంటారు.కానీ, అలా ఎప్పుడూ చేయ‌రాదు.

ఉప్పు ఆరోగ్యానికి ముప్ప‌ని అంద‌రికీ తెలుసు.అందుకే జ్యూసుల్లో ఉప్పు క‌లిపి తీసుకో రాదు.

అలాగే పండ్లతో త‌యారు చేసిన జ్యూసుల్లో షుగ‌ర్ ను క‌లిపే అల‌వాటు దాదాపు అంద‌రికీ ఉంటుంది.కానీ, పండ్ల‌లు సహజ చక్కెర్ల‌ను క‌లిగి ఉంటాయి.వాటికి మీరు అద‌న‌పు చ‌క్కెర క‌లిపి తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు పెరుగుతుంది త‌ప్పా.ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Telugu Good Health, Health, Health Tips, Healthy Juices, Juices, Latest News, Making Juices, Mistakes-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

పండ్లు లేదా కూర‌గాయ‌ల‌తో జ్యూస్ చేసే టైమ్‌లో.వాటిలోకి గింజ‌ల‌ను తొలిగించాలి.లేకుంటే జ్యూస్‌ రుచి మారుతుంది.అందుకే ఆల‌స్య‌మైన గింజ‌ల‌ను తీసేయాలి.

కొంద‌రికి జ్యూసుల్లో ఐస్ క్రీమ్ క‌లిపి అల‌వాటు ఉంటుంది.కానీ, ఐస్ క్రీమ్‌లో ప్యాట్ కంటెంట్ ఉంటుంది.అటువంటి ఐస్ క్రీమ్‌ను ఫ్రెష్ జ్యూసుల్లో క‌లిపి తాగితే.ఆరోగ్యానికి పెద్ద‌గా ప్ర‌యోజ‌నాలేవి ల‌భించ‌వు.

ఇక ఇంట్లో త‌యారు చేసుకునే జ్యూసుల‌ను ఫ్రిజ్‌లో పెట్టి తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల జ్యూస్‌లో ఉండే పోష‌కాల‌న్నీ న‌శిస్తాయి.

అందుకే జ్యూస్ త‌యారు చేసిన త‌ర్వాత ఫ్రీజ్‌లో పెట్ట‌కుండా వెంట‌నే సేవించాలి.

#Tips #Healthy

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube