ప‌వ‌న్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న ఆ నాయ‌కులు..

ఎన్నిక‌ల్లో గెలుపు, ఓట‌ముల‌ను పెద్ద‌గా లెక్క చేయ‌బోమ‌ని, మార్పు కోస‌మే ప‌నిచేస్తామ‌ని గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.అయితే ఈ మాట‌ల‌ను నిజం చేసిచూపించేందుకు జ‌న సైనికులు మాత్రం బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.

 Those Leaders Who Are Waiting For The Call Of Pavan. Pavan, Janasena , Ap Polti-TeluguStop.com

వాస్త‌వానికి 2019 సార్వ‌త్రిక ఎన్నికల్లో జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన చాలామంది నేత‌లు ఆ త‌ర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.కానీ కొంతమంది మాత్రం వేరే దిక్కు చూడ‌కుండా పార్టీలోనే యాక్టివ్ గా కొనసాగుతున్నారు.

ఇప్ప‌టికి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక రాబోయే 2024 సార్వ‌త్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు.

మ‌ల్లీ అవ‌కాశం ఇస్తే తామే జనసేన తరపున పోటీ చేసి ఈ సారి ఎలాగైనా గెలిచేందుకు బాగానే క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని చెప్పాలి.ఇంకా కొంద‌రు అయితే ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలవక‌పోయినా కూడా క‌నీసం రాజకీయ నేత‌గా ప్ర‌జ‌ల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.

మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా వీరంతా వ‌చ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా స‌రే పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు.

Telugu Ap Bjp, Ap Poltics, Janasena, Pavan, Pavan Kalyan, Ys Jagan, Ysrcp-Telugu

కాగా వీరంతా కూడా ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు కోసం ఎద‌రు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.త‌మ భవిష్యత్ పై పవన్ క‌ల్యాణ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.త‌ప్ప‌కుండా టికెట్ త‌మ‌కే ఇస్తారనే నమ్మకంతో వారంతా కూడా ఉన్నారు.

అయితే ఇలా రెండేళ్లకు పైగా పార్టీని న‌మ్ముకుని ప్రజల్లో ఉంటున్న వారికి ఇప్పుడు ప‌వ‌న్ భ‌రోసా ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.ఎందుకంటే ఇలాంటి వారిని న‌మ్ముకుంటేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్యం అవుతుంది.

కాబట్టి వారంతా ఎదురుచూస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌స్తేనే బాగుటుంది.లేదంటే న‌ష్టం త‌ప్ప‌దేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube