వామ్మో.. పాములే ఆవిడ పెంపుడు జంతువులట..! అది కూడా ఎన్నంటే..?!

ఈ మధ్య రోజుల్లో చాలామంది వారి ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ఇందులో భాగంగానే చాలా దేశాలలో వారి ఇళ్లలో సాధు జంతువులుగా పిళ్లి, కుక్క, కుందేలు లాంటి జంతువులను పెంచుకుంటూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.

 Those Big Snakes Are His Domestics Animals, Pythons, Snakes, Philippines, Social-TeluguStop.com

వీటితో పాటు మరి కొందరు కొన్ని రకాల జాతుల పక్షులకు కూడా ఎంచుకోవడానికి ఇష్టపడుతారు.అరబ్ దేశాలలో కాస్త భిన్నంగా పులులు, సింహాలు లాంటివి పెంచుకోవడం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం.

అయితే పాములను కూడా సాధు జంతువుగా పంచుకోవడం ఇది వరకు మనం ఒకటి రెండుసార్లు విన్నాం.అయితే తాజాగా మరో 14 సంవత్సరాలు ఉన్న ఓ అమ్మాయి కూడా తన పెంపుడు జంతువులగా కొండచిలువలను పెంచుకుంటుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇండోనేషియా దేశానికి చెందిన 14 సంవత్సరాల అమ్మాయి చల్వాఇస్మా కమల్‌ అనే అమ్మాయికి చిన్నప్పుడు నుంచి పాములు అంటే తెగ ఇష్టం.

అవును మీరు వింటున్నది నిజమే.ప్రస్తుతం ఆమె వద్ద ఏకంగా అరడజను కొండచిలువలు జీవిస్తున్నాయి.ఆ అమ్మాయి ఆమె స్నేహితుల కంటే ఆ కొండచిలువ లతోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.వాటికి స్నానం చేయడమే కాకుండా, వాటికి కావలసిన ఆహార పదార్థాలను తినిపించడం.

వాటితో ఆడుకోవడం లాంటి ప్రక్రియలు రోజు చేస్తూ ఉంటుంది.తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఈ కొండచిలువతో ఆమె ఒక్కటే ఆడుకోకుండా తన తమ్ముడితో కలిసి కూడా వాటితో ఆడుకుంటుంది.

ఆ పాముల వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని చల్వాఇస్మా కమల్‌ చెబుతోంది.నిజానికి ప్రజల్లో పాముల పై ఉన్న భయాన్ని పోగొట్టేందుకు తను ఇలా చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఆవిడ పాములతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఆవిడ కూడా తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా కొన్ని వీడియోలను అప్లోడ్ చేస్తుండడంతో వాటికి పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube