డ్రస్‌ సరిగా లేదంటూ ఆమెను విమానం నుండి దింపేందుకు సిబ్బంది ప్రయత్నం... ఆమె ఏం చేసిందో తెలుసా?  

  • థామస్‌ కుక్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఒక మహిళ యూకే నుండి క్యానరీ ఐలాండ్స్‌కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అందరిలాగే అన్ని రకాలుగా సిద్దం అయ్యి వెళ్లిన ఎమిలీ ఓ కానర్‌ ను మాత్రం అక్కడ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ విమానంలో ప్రయాణించే వారందరు కూడా వెళ్లి ఎవరి సీట్లో వారు కూర్చున్నారు. కాని ఆమెను మాత్రం సిబ్బంది ఇబ్బంది పెట్టారు. మీరు వేసుకున్న డ్రస్‌ కారణంగా మిమ్ములను విమానంలో ప్రయాణించేందుకు అనుమతించడం లేదు, దయచేసిమ ఈరు విమానం దిగండి అంటూ నలుగురు హెయిర్‌ హోస్టస్‌ మరియు ప్టైట్‌ మ్యానేజర్‌ ఆమెకు విజ్ఞప్తి చేశారు.

  • Thomas Cook Airlines Tells Passenger To 'Cover Up Or Leave Plane'-Ms O\'connor Telugu Viral News Thomas Trolls On In Social Media

    Thomas Cook Airlines Tells Passenger To 'Cover Up Or Leave Plane'

  • మీ డ్రస్‌ అసభ్యంగా ఉండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందుకే మీరు పైన జాకెట్‌ వేసుకోవాలి లేదంటే మీరు దయచేసి విమానం దిగి వెళ్లండి అంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఆమె వారితో తీవ్ర వాగ్వివాదంకు దిగింది. తాను ఎందుకు విమానం దిగాలంటూ వారితో వాదించింది. అయినా కూడా వారు తమ మాటను పట్టుకుని ఉండటంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తన ఒంటిపై మరో జాకెట్‌ను వేసుకుంది. తన పట్ల విమాన సిబ్బంది ప్రవర్తించిన తీరును థామస్‌ కుక్‌ ఎయిర్‌ లైన్స్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేసింది.

  • Thomas Cook Airlines Tells Passenger To 'Cover Up Or Leave Plane'-Ms O\'connor Telugu Viral News Thomas Trolls On In Social Media

  • Thomas Cook Airlines Tells Passenger To 'Cover Up Or Leave Plane'-Ms O\'connor Telugu Viral News Thomas Trolls On In Social Media
  • ఎమిలీ ఓ కానర్‌ ట్వీట్‌కు రెస్పాండ్‌ అయిన థమస్‌ కుక్‌ ఎయిర్‌ లైన్స్‌ వారు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ విమాన సిబ్బందికి మరింత మంచిగా, ప్రయాణికులను గౌరవించేలా ట్రైనింగ్‌ చేస్తామని చెప్పారు. మా సేవలను మరింతగా మెరుగు పరుచుకునేందుకు మీ ఫిర్యాదును మేము సలహాలా స్వీకరిస్తామని సదరు విమాన సంస్థ సోషల్‌ మీడియా ద్వారా రెస్పాండ్‌ అవ్వడం వైరల్‌ అయ్యింది. అయితే ఆమె తీరును కూడా కొందరు విమర్శిస్తున్నారు. అసభ్యకరంగా ఉన్న డ్రస్‌తో విమాన ప్రయాణం చేయడం ఏంటని కొందరు ఆమెను సోషల్‌ మీడియా ద్వారా తిట్టి పోస్తున్నారు.